Devara 2: ‘దేవర 2 ‘ షూటింగ్ ప్రారంభ తేదీ ఫిక్స్.. ఎన్టీఆర్ ని ఢీ కొట్టేందుకు బాలీవుడ్ క్రేజీ హీరో!

జనాల్లో ఆసక్తి ని ఏర్పాటు చేయడం కోసమే 'దేవర 2' అన్నారు కానీ, నిజానికి ఆ సినిమా తెరకెక్కే అవకాశం లేదని, ఎప్పటికీ ఆ చిత్రం రాదని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్నారు. కానీ 'దేవర 2 ' చిత్రం నిజంగానే ఉంటుందట. వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఈ ఏడాది నవంబర్ నెల నుండి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రం లో నటించబోతున్నాడు.

Written By: Vicky, Updated On : October 2, 2024 5:11 pm

Devara 2

Follow us on

Devara 2: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లతో సత్తా చాటిన ఎన్టీఆర్, లాంగ్ రన్ కూడా అదే దూకుడు ని చూపిస్తున్నాడు. సోమవారం, మంగళవారం రోజుల్లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నేడు ప్రతీ సెంటర్ లో దంచి కొడుతోంది. సిటీలు, టౌన్స్ లో మాత్రమే కాదు, ‘C’ సెంటర్స్ లో కూడా నేడు ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. చూస్తుంటే నేడు తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా చివర్లో ట్విస్ట్ ఇస్తూ ‘వర’ నే తన తండ్రి ‘దేవర’ ని చంపేశాడు, ఎందుకు చంపాడు? అనే క్వశ్చన్ మార్క్ జనాల బుర్రలో వేస్తూ ‘దేవర 2 ‘ అని టైటిల్ పడే సంగతి అందరికీ తెలిసిందే.

జనాల్లో ఆసక్తి ని ఏర్పాటు చేయడం కోసమే ‘దేవర 2’ అన్నారు కానీ, నిజానికి ఆ సినిమా తెరకెక్కే అవకాశం లేదని, ఎప్పటికీ ఆ చిత్రం రాదని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్నారు. కానీ ‘దేవర 2 ‘ చిత్రం నిజంగానే ఉంటుందట. వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఈ ఏడాది నవంబర్ నెల నుండి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రం లో నటించబోతున్నాడు. ఈ సినిమాతో పాటుగా ‘వార్ 2’ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తాడు. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి నెలలోపు పూర్తి అవుతాయని, ‘దేవర 2’ చిత్రాన్ని మార్చి, లేదా ఏప్రిల్ నెలలో మొదలు పెడతారని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త.

ఈ సినిమాకి సంబంధించిన బేసిక్ స్టోరీ లైన్ ని కొరటాల శివ ఇప్పటికే సిద్ధం చేసాడట. పూర్తి స్థాయి స్క్రిప్ట్ మీద అతి త్వరలోనే ద్రుష్టి పెడుతాడని తెలుస్తుంది. ప్రస్తుతం మూవీ టీం మొత్తం మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నారు. అతి త్వరలోనే రామోజీ ఫిలిం సిటీ లో విజయోత్సవ సభ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభలోనే ‘దేవర 2’ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని అభిమానులకు తెలియచేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం లో కూడా హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపిస్తుందట. సైఫ్ అలీ ఖాన్ తో పాటుగా, మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బలంగా పార్ట్ 2 లో ఉంటాయని అంటున్నారు.