https://oktelugu.com/

Pawan Kalyan: అవకాశం వస్తే అ తమిళ హీరో కాళ్ళు పట్టుకుంటాను అంటూ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్ తమిళం అనర్గళంగా మాట్లాడడం చూసి షాక్ కి గురయ్యారు తమిళ జనాలు. తమిళనాడు సంస్కృతి గురించి ఇంతటి పరిజ్ఞానం మా రాజకీయ నాయకులకు కూడా లేదు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా నీ స్థాయిలో తమిళం మాట్లాడలేడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పై తమిళనాడు కి చెందిన నెటిజెన్స్ ట్రోల్స్ చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 05:03 PM IST

    Pawan Kalyan(18)

    Follow us on

    Pawan Kalyan: ‘సనాతన ధర్మం రక్షకుడు’ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పేరు దేశ వ్యాప్తంగా ఎలా మారుమోగిపోతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు వివాదం విషయం లో ఏదైనా మాట్లాడితే తమ రాజకీయ జీవితం రిస్క్ లో పడుతుంది అని కొంతమంది రాజకీయ నాయకులూ భయపడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం దీనిని తన భుజాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు. జాతీయ స్థాయిలో సెన్సేషనల్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ ని వివిధ రాష్ట్రాలకు చెందిన పాపులర్ మీడియా చానెల్స్ రీసెంట్ గానే ఇంటర్వ్యూస్ చేసాయి. అందులో భాగంగా ఆయన తమిళం లో ప్రఖ్యాతి గాంచిన ‘తంటి టీవీ’ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన తమిళనాడు సంస్కృతి గురించి, తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎంతో పరిజ్ఞానం ఉన్నవాడిలాగా మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ గా మారాయి.

    అంతే కాదు పవన్ కళ్యాణ్ తమిళం అనర్గళంగా మాట్లాడడం చూసి షాక్ కి గురయ్యారు తమిళ జనాలు. తమిళనాడు సంస్కృతి గురించి ఇంతటి పరిజ్ఞానం మా రాజకీయ నాయకులకు కూడా లేదు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా నీ స్థాయిలో తమిళం మాట్లాడలేడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పై తమిళనాడు కి చెందిన నెటిజెన్స్ ట్రోల్స్ చేసారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ట్రోల్స్ చేసినవాళ్ళే మళ్ళీ పొగుడుతున్నారు. ఆ స్థాయిలో ఈ ఇంటర్వ్యూ ఉంది. తమిళ సినిమాలను రెగ్యులర్ గా చూస్తుంటారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘ సమయం దొరికినప్పుడల్లా చూస్తుంటాను. నాకు యోగిబాబు నటన అంటే చాలా ఇష్టం. రీసెంట్ గానే లియో చిత్రం చూసాను. ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాలు బాగా ఇష్టం, అతని టేకింగ్ స్టైల్ చాలా బాగుంటుంది’ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

    ఇంకా ఆయన కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ ‘నేను కమల్ హాసన్ గారిని కలిసి ఆయన పాదాలను మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది. అవకాశం వస్తే కచ్చితంగా కలుస్తాను. నేను గెలిచినప్పుడు ఆయన సోదర భావంతో ఎంతో గొప్పగా, మనస్ఫూర్తిగా నన్ను అభినందించారు. ఆయన మాటల్లో ఎంతో ఆప్యాయత కనిపించింది. రాజకీయంగా ఆయన బీజేపీ కి వ్యతిరేకం, ఆయన విధానాలు వేరే, కానీ నేను వ్యక్తిగతంగా ఆయనను చాలా గౌరవిస్తాను, త్వరలో కలుస్తాను’ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడు. ఈ ట్వీట్ ని మరోసారి రీ ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో కి లింక్ చేస్తున్నారు అభిమానులు.