Mahesh Babu Sister in Okkadu movie : మహేష్ బాబు సినీ కెరీర్ లో “ఒక్కడు” సినిమా ప్రత్యేకమైనది. అప్పట్లో ఆల్ టైం రికార్డు సృష్టించిన ఈ సినిమా మహేష్ కి సోలో మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇంటిల్లిపాదినీ అలరించి పెద్ద విజయమే సాధించింది. పైగా మహిళా ప్రేక్షకులకు మహేష్ ను దగ్గర చేసింది. అయితే, ఈ సినిమాలో మహేష్ తో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో నటి కూడా ఉంది.
Mahesh Babu Sister in Okkadu movie
ఇంతకీ ఎవరు ఆ నటి అంటే.. ఈ చిత్రంలో ‘మహేష్ చెల్లెలిగా చేసిన అమ్మాయి. చాలా సహజంగా నటిస్తోందే అని పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే.. ఆమె నేటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. అసలు ఈ అమ్మాయి ఎవరు ? ఆమె ప్రస్తుతం ఏమి చేస్తోంది ? చూద్దాం. ఆమె పేరు నిహారిక. 2003 లో రిలీజ్ అయినా ఒక్కడు సినిమాతో ఆమె సినీ జర్నీ మలుపు తీసుకుంది.
Also Read: Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ లో బూతులు: బిందుతోపాటు పదిమందికి బిగ్ షాక్..
అప్పట్లో ఆ సినిమా బ్లాక్ బఫ్టర్ హిట్ అవ్వడంతో నిహారికకు కూడా మంచి పేరు వచ్చింది. మహేష్ చెల్లెలిగా ఆశ అనే క్యారక్టర్ లో నిహారిక జీవించింది. నిజానికి ఒక్కడు సినిమాకు ముందే నిహారిక నటిగా ఎంట్రీ ఇచ్చింది. మోహన్ బాబు హీరోగా చేసిన యమజాతకుడు అనే సినిమాలో మోహన్ బాబుకి మేనకోడలి పాత్రలో నటించి మెప్పించింది.
Mahesh Babu Okkadu Sister
ఆ తర్వాత వెంకకేష్ హీరోగా చేసిన ‘ప్రేమింకుందాం రా’ అనే చితంలో కూడా నిహారిక చైల్స్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత నిహారికకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. కానీ చదువుకి ఇబ్బంది అవుతుంది అని ఆమె పేరెంట్స్ ఆమె మళ్ళీ సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. నిహారిక కూడా వచ్చిన అవకాశాలకు నో చెప్పి.. తన ఫుల్ ఫోకస్ మొత్తం చదువుల ఫైన పెట్టింది.
Mahesh Babu Okkadu Sister
ఇప్పుడు ప్రస్తుతం తన చదువు పూర్తి చేసుకున్న నిహారిక మళ్ళీ సినిమా అవకాశాల కోసం తాజాగా ఫోటో షూట్ చేసింది. ఓ ప్రముఖ దర్శకుడు నిహారికకు అవకాశం ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన ఈమె నటిగా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తోందో చూడాలి.