Bigg Boss Telugu OTT: రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వేదికగా అలరిస్తోంది. అయితే బిగ్ బాస్ షో 5 సీజన్లు సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఎంటర్టైన్ చేయడానికి మనముందుకు తీసుకువచ్చారు. కాగా ఈ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తోండగా ఇందులో మొత్తం 17 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. దీనికి ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించారు. ప్రేక్షకులకు భారీగా వినోదాన్ని పంచుతోంది. అయితే ఇప్పటి వరకు ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు బయటకు వెళ్లారు.
Bigg Boss Telugu OTT
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా హౌస్ లో కంటెస్టెంట్స్ ల మాటలు శృతిమించుతున్నాయి. గొడవలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. వారానికి ఒకసారి జరిగే నామినేషన్స్ పేరుతో తెగ తిట్టుకుంటున్నారు. కొందరైతే మరీ బరితెగిస్తున్నారు. వీళ్ల చేష్టలతో ఏంట్రా బాబూ.. ఇది అనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు. నామినేషన్ వస్తే చాలు బూతులపురాణం మొదలు పెడుతున్నారు.
Also Read: Samantha: బ్రా చూపిస్తూ సమంత హాట్ ఫొటో.. సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోందిగా
కాగా నామినేషన్స్ టాస్క్ ఎంతో రచ్చగా సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో ఒక కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. అందుకు గానూ ఆ ఇద్దరి ఫొటోలను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మంటల్లో తగలబెట్టి అందుకు తగిన కారణాలను చెప్పాలి.
అజయ్, హమీదా మధ్య ఫక్ పదం గురించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. తనపై అనవసరంగా నిందలు వేసిందని అజయ్ ఆమెను నామినేట్ చేశాడు. దీనికామె అక్కడ నేను విన్నదే చెప్పానని వాదించింది. అయితే నటరాజ్ మాస్టర్ మరోసారి రెచ్చిపోయాడు. తనను నామినేట్ చేసిన అనిల్‌పై ఫైర్ అయ్యాడు. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అన్నట్లుగా సైగలు చేశాడు. ఆ తర్వాత బిందు, స్రవంతిపైనా నటరాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడాడు.
Bigg Boss Telugu OTT
కాగా ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్కులో మొత్తంగా పది మంది నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. అందులో మిత్ర శర్మ, నటరాజ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్‌లు ఉన్నారు. అయితే కెప్టెన్ అయిన అఖిల్‌తో పాటు అజయ్, ఆరియానాలు ఈ వారం నామినేషన్స్ తప్పించుకున్నారు.
Also Read:Megastar Chiranjeevi- Taapsee Pannu: చేతులెత్తేసిన తాప్సీ అభాసుపాలైన మెగాస్టార్