https://oktelugu.com/

AP New Districts: అరుదైన సందర్భం: ఇద్దరు ఐఏఎస్ లు , ఇద్దరు ఐపీఎస్ లు ఒకే జిల్లాల్లో పోస్టింగ్..

AP New Districts: ఏపీలో సోమవారం నుంచి పునర్విభజన జిల్లాల్లో పాలన మొదలైంది. ఇప్పటి వరకు 13 జిల్లాలు ఉండగా పునర్వవ్యవస్థీకరణలో భాగంగా 26గా మారాయి. పాత జిల్లాల్లోలని కొన్ని మండలాలు, నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు ఆయా ప్రాంతంలోని ప్రముఖుల పేర్లు పెట్టారు. దీంతో కొత్త జిల్లాల్లో ఇప్పటికే అధికారుల విభజన కూడా పూర్తయింది. ఐఏఎస్ లు, ఏపీఎస్ లో ఆయా జిల్లాలకు వెళ్లి తమ బాధ్యతలను స్వీకరించారు. మిగిలిన శాఖ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 5, 2022 1:53 pm
    Follow us on

    AP New Districts: ఏపీలో సోమవారం నుంచి పునర్విభజన జిల్లాల్లో పాలన మొదలైంది. ఇప్పటి వరకు 13 జిల్లాలు ఉండగా పునర్వవ్యవస్థీకరణలో భాగంగా 26గా మారాయి. పాత జిల్లాల్లోలని కొన్ని మండలాలు, నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు ఆయా ప్రాంతంలోని ప్రముఖుల పేర్లు పెట్టారు. దీంతో కొత్త జిల్లాల్లో ఇప్పటికే అధికారుల విభజన కూడా పూర్తయింది. ఐఏఎస్ లు, ఏపీఎస్ లో ఆయా జిల్లాలకు వెళ్లి తమ బాధ్యతలను స్వీకరించారు. మిగిలిన శాఖ వాళ్లు కూడా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అధికారుల విభజనలో భాగంగా కొన్ని జిల్లాల్లో అరుదైన సంఘటన చోటు చేసుకొంది. భార్యభర్తలుగా ఉన్న అధికారులు ఒక్క జిల్లాకు రావడం ఆశ్చర్యంగా మారింది. దీంతో వారిని లక్కీ కపుల్స్ గా పేర్కొంటున్నారు.

    ఏపీలో జిల్లాల విభజనకు పెద్ద కసరత్తే జరిగింది. విస్తీర్ణం, పాపులేషన్ ఆధారంగా పక్కాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాల విభజన తరువాత విస్తీర్ణం పరంగా ప్రకాశం 14,322 చదరపు కిలోమీటర్లతో అతిపెద్ద జిల్లాగా అవతరించింది. జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అతిపెద్దదిగా మారింది. ఈ జిల్లాలో 24 లక్షల 70 వే మంది జనాభా ఉన్నారు. అలాగే ఈ జిల్లాలో 8 నియోజకవర్గాలు 38 మండలాలు ఉన్నాయి. అతి తక్కువ మండలాలు ఉన్న జిల్లాగా విశాఖ మారింది. ఈ జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు, 11 మండలాలు మాత్రమే ఉన్నాయి.

    ప్రతి జిల్లాలో దాదాపు 9 లక్షలకు పైగానే జనాభా ఉంది. నాలుగు జిల్లాల్లో 4 చొప్పున రెవెన్యూ డివిజన్లు ఉన్ాయి. 12 జిల్లాల్లో మాత్రం 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మిగిలిన 10 జిల్లాల్లో మాత్రం 2 రెవెన్యూ జిల్లాలే ఉన్నాయి. భౌగోళికంగా, పాలన పరంగా అనుకూలంగా ఉండేలా జిల్లాలను విభజించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రణాలిక వేశారు. స్థానికంగా వచ్చిన వినతుల పరంగా కొన్ని మండలాలను తమకు అనుకూలంగా ఉన్న జిల్లాల్లో చేర్చారు. మొత్తానికి 26 జిల్లాలలను విభజిస్తూ ఎటువంటి ఆందోళన లేకుండా చేశారు.

    ఇక అధికారుల విభజన ఇప్పటికే పూర్తయ్యింది. ప్రతీ జిల్లాకు ఒక ఎస్పీ, కలెక్టర్ ను నియమించారు. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ శనివారమే ఉత్తర్వులు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన కొత్త రెవెన్యూ డివిజన్లలోని పోస్టులను విభజించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించింది. కొత్త జిల్లాలకు సినీయారిటీ ప్రకారంగా ఉద్యోగులను బదిలీ చేసింది. ఇక ఈ బదిలీల్లో భాగంగా కొన్ని చోట్లు భార్యభర్తలిద్దరు ఉద్యోగులు ఒకే చోట పోస్టింగ్ వచ్చింది. ప్రకాశం జిల్లా ఎస్పీగా మలికా గార్గ్ ఉండగా.. బాపట్ల ఎస్పీగా ఆమె భర్త వకుల్ జిందాల్ నియమితులయ్యారు. అలాగే ప్రకాశం కలెక్టర్ దినేశ్ కుమార్ కాగా.. ఆయన సతీమణి విజయకు బాపట్ల కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది. యాదృశ్చికంగా జరిగినా ఇద్దరు ఐఏఎస్ లు , ఇద్దరు ఐపీఎస్ లు ఒకే దగ్గర పోస్టింగ్ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.