spot_img
Homeఎంటర్టైన్మెంట్Devil: కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు అదే శాపమా.. ఆ గొడవే సినిమాను దెబ్బ తీస్తుందా?

Devil: కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు అదే శాపమా.. ఆ గొడవే సినిమాను దెబ్బ తీస్తుందా?

Devil: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కళ్యాన్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకొనిపోతున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు ఈ నందమూరి హీరో. అయితే గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించింది. ఈ రిజల్ట్ మరో సినిమా వద్ద కూడా రిపీట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత వచ్చిన మరో సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ హీరో డెవిల్ సినిమాలో నటిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ ను అందుకొని మళ్లీ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన కొంతకాలానికి వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతూనే ఉన్నాయి. పోస్టర్ లో ఉన్న దర్శకుడి పేరును టీమ్ తొలగించడంతో సినిమా వివాదంలో పడిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కానీ మరో స్థాయికి కూడా చేరింది.

మొదటగా నవీన్ మేడారం దర్వకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కానీ మేకింగ్ విషయంలో కొన్ని విభేదాల కారణంగా చిత్ర బృందం అతని పేరును తొలగించింది. అంతేకాకుండా చిత్ర నిర్మాత అభిషేక్ నామా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు క్రెడిట్ ను తీసుకున్నట్టు తెలియడంతో అందరూ ఆశ్యర్యపోయారు. అయితే ఈ వివాదం విషయంలో దర్శకుడు హర్టై సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ కూడా పెట్టారు. దానిపై ఎవరూ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే చివరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంలో మైనంగా ఎందుకు ఉన్నాడు అనే విషయం ఎవరికి అర్థం కాలేదు.

ఎంతకీ గొడవ ఓ కొలిక్కి రాకపోవడంతో బాధ పడ్డ దర్శకుడు నవీన్ తన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే ఇవన్నీ చాలవన్నట్టు ఇంతలోనే మరొక సమస్య వచ్చి పడింది. థియేట్రికల్ బిజినెస్ విషయంలో నిర్మాత ఇబ్బంది పడుతున్నట్టు టాక్ వస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా ముగియాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సమయానికి థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అవ్వాలి. కానీ వివాదం కారణంగా సినిమా చుట్టూ ఉన్న పేలవమైన బజ్ సినిమాకు అడ్డంకిగా మిగిలిపోయింది. దీంతో సినిమాపై పెట్టుబడులు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్స్ వెనుకడుగు వేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version