https://oktelugu.com/

Kannappa First Look: కన్నప్ప.. అంచనాలు పెంచేసిన మంచు విష్ణు

రీసెంట్ గా ఈ హీరో కన్నప్ప అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మహా శివుడి పరమ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని ముకేష్ కుమార్ సింగ్ అనే దర్శకుడు రూపొందిస్తున్నారు.

Written By: , Updated On : November 23, 2023 / 12:17 PM IST
Kannappa

Kannappa

Follow us on

Kannappa: మంచు విష్ణు ఈ పేరంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి పరిచయమైనా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విష్ణు. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారట మంచు వారి అబ్బాయి. వరుస ప్లాపులతో నిరాశ పరుస్తున్న మంచు విష్ణు ఈ సారి భారీ హిట్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

రీసెంట్ గా ఈ హీరో కన్నప్ప అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మహా శివుడి పరమ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని ముకేష్ కుమార్ సింగ్ అనే దర్శకుడు రూపొందిస్తున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటోంది. మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏ మాత్రం బ్రేకులు లేకుండా దీన్ని షూట్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కట్టప్ప సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు మేకర్స్.

మంచువారి అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా కన్నప్ప మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ వీరుడు బాణం ఎక్కుపెట్టి కనిపించాడు. బ్యాగ్రౌండ్ లో ఉన్న ప్రకృతి శివలింగం ఆకారంలో కనిపించేలా డిజైన్ చేశారు. మొత్తానికి ఈ పోస్టర్ లో హీరో ముఖం కనిపించకున్నా.. మూవీపై అంచనాలు మాత్రం పెంచేశారు. కన్నప్ప ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ ఓ నాస్తిక యోధుడు మహా శివుని భక్తుడిగా చేసిన ప్రయాణం ప్రాణం పోసుకుంది అంటూ రాసుకొచ్చారు విష్ణు.

ఇదిలా ఉండగా కన్నప్ప సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్లు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి మణి శర్మ, స్టీఫెన్ సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.