Chandrababu: చంద్రబాబు కేసుల్లో సిఐడిలో స్పష్టమైన మార్పునకు అదే కారణమా?

తాజాగా మద్యం కేసులో సిఐడి ప్రవర్తనను చూసి కోర్టువర్గాలే ఆశ్చర్యపోయాయి. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు సిఐడి తనకు తానే సంకేతాలు ఇస్తోంది. కోర్టు ముందు పెట్టిన పత్రాల్లో ఎక్కడా చంద్రబాబు సంతకాలు లేవు.

Written By: Dharma, Updated On : November 23, 2023 11:42 am

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు కేసులు విషయంలో సిఐడి గాడి తప్పుతోందా? ఆధారాలు చూపడంలో ఫెయిల్ అవుతోందా? అందుకే చంద్రబాబుకు వరుసగా ఉపశమనాలు కలుగుతున్నాయా? దీనికి సిఐడి వైఫల్యమే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఒకవేళ అరెస్టు చేసిన గంటల వ్యవధిలో ఆయన బయటకు వస్తారని భావించారు. కానీ గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలు గడిచాయి. దాదాపు రెండు నెలలు చంద్రబాబు జైల్లో గడపాల్సి వచ్చింది. సిఐడి పక్కా వ్యూహంతోనే ఎన్నాళ్లపాటు చంద్రబాబును జైల్లో ఉంచగలిగిందని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కేసుల విచారణలో సిఐడి డొల్లతనం వెలుగు చూడడం విమర్శలకు తావిస్తోంది.

తాజాగా మద్యం కేసులో సిఐడి ప్రవర్తనను చూసి కోర్టువర్గాలే ఆశ్చర్యపోయాయి. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు సిఐడి తనకు తానే సంకేతాలు ఇస్తోంది. కోర్టు ముందు పెట్టిన పత్రాల్లో ఎక్కడా చంద్రబాబు సంతకాలు లేవు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి షాపులకు లబ్ధి కలిగించారని, డిస్టలరీలకు ఆయాచిత లబ్ధి కలిగించాలని కేసులు నమోదు చేశారు. అయితే తీరా కోర్టులో విచారణకు వచ్చేసరికి చంద్రబాబు ప్రమేయాన్ని ఎక్కడా నిర్ధారించలేకపోయారు.

వాస్తవానికి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఫైలు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లలేదు. ఈ విషయాన్ని సిఐడియే కోర్టుకు తన పత్రాల ద్వారా తెలిపింది. కిందిస్థాయిలోనే ప్రివిలేజ్ ఫీజు రద్దు పై నిర్ణయం జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే చంద్రబాబు అనుమతి ఇచ్చిన తర్వాతేనే డిస్టలరీలకు అనుకూలంగా నిర్ణయాలు జరిగిపోయాయని సిఐడి వాదిస్తోంది. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల మద్యం అమ్మకాలు పెరిగాయని.. ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగలేదని నాడు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకొని ఏపీ సిఐడి చంద్రబాబుపై మద్యం కేసు నమోదు చేసింది. ఇలా చేసే క్రమంలో సరైన ఆధారాలు చూపించలేకపోయింది. ఇప్పటికేస్కిల్ స్కేమ్ లో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ విషయంలో కోర్టు కొన్ని రకాల అనుమానాలు వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదని.. సాక్షాలు, ఆధారాలను సేకరించలేకపోయారని.. అందుకే చంద్రబాబుకు అనారోగ్యం కారణాల దృష్ట్యా బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై సీఐడీ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించినా ఫలితం లేకపోయింది. ఈ లెక్కన మద్యం కుంభకోణం కేసులో సైతం న్యాయస్థానం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు అరెస్టు, ఆయన రిమాండ్ లో పట్టు బిగించిన సీఐడీ.. మిగతా కేసుల విచారణ సమయంలో చాకచక్యంగా వ్యవహరించలేకపోతోంది. సరైన ఆధారాలు చూపలేక విచారణ సమయంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.