https://oktelugu.com/

Shanmukh Deepthi Sunaina: షన్ను-దీప్తి ప్రేమలో సిరి చిచ్చు.. బ్రేకప్ దిశగా రిలేషన్? ఆ పోస్ట్స్ మీనింగ్ అదేనా?

Shanmukh Deepthi Sunaina: ప్రతి రిలేషన్ కి హద్దులు ఉంటాయి. విచ్చలవిడిగా కౌగిలించుకుంటూ ఓ అమ్మాయి, అబ్బాయి మేము ఫ్రెండ్స్ అంటే.. నమ్మడం కష్టమే. బిగ్ బాస్ షో వేదికగా షణ్ముఖ్-సిరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. షో బిగినింగ్ నుండి ఎండ్ వరకు ఎన్ని విమర్శలు ఎదురైనా వీరి తీరు మారలేదు. స్వయంగా నాగార్జున హెచ్చరించినా బాండింగ్ వదులుకోలేదు. హౌస్ లో ఒకరికొకరుగా, ఇద్దరిలా ఉన్న ఒకరిగా మనుగడ సాగించారు. ఒక్క క్షణం విడిగా […]

Written By:
  • Shiva
  • , Updated On : December 23, 2021 / 11:11 AM IST
    Follow us on

    Shanmukh Deepthi Sunaina: ప్రతి రిలేషన్ కి హద్దులు ఉంటాయి. విచ్చలవిడిగా కౌగిలించుకుంటూ ఓ అమ్మాయి, అబ్బాయి మేము ఫ్రెండ్స్ అంటే.. నమ్మడం కష్టమే. బిగ్ బాస్ షో వేదికగా షణ్ముఖ్-సిరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. షో బిగినింగ్ నుండి ఎండ్ వరకు ఎన్ని విమర్శలు ఎదురైనా వీరి తీరు మారలేదు. స్వయంగా నాగార్జున హెచ్చరించినా బాండింగ్ వదులుకోలేదు.

    Shanmukh Deepthi Sunaina

    హౌస్ లో ఒకరికొకరుగా, ఇద్దరిలా ఉన్న ఒకరిగా మనుగడ సాగించారు. ఒక్క క్షణం విడిగా ఉండేవారు కాదు షణ్ముఖ్, సిరి. ముఖ్యంగా సిరి అతడి సాంగత్యం కోరుకునేది. ఛీ అన్నా… చీదరించుకున్నా నువ్వే కావాలి అనేది. అలాగే షణ్ముఖ్ కూడా. ఆమెతో ఎంత గొడవపడ్డా కాసేపట్లో కాంప్రమైజ్ అయ్యేవాడు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసేవాడు. ఇక సిరి ఎవరికైనా దగ్గరవుతున్నట్లు అనిపిస్తే అసలు తట్టుకోలేకపోయేవాడు.

    హౌస్ లో సిరి, షన్ను రిలేషన్ ఇంత ఘాటుగా నడిచింది. షన్ను టైటిల్ కోల్పోవడానికి కూడా అసలు కారణం ఇదే అని పలువురి వాదన. కాగా సిరితో షణ్ముఖ్ హౌస్ లో వ్యవహరించిన తీరు మరో వివాదానికి దారి తీసినట్లు తెలుస్తుంది. షన్నుపై లవర్ దీప్తి సునైన కోపంగా ఉన్నారని, బ్రేకప్ కూడా చెప్పొచ్చని అంటున్నారు. దీనికి రుజువుగా ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూపిస్తున్నారు.

    Also Read: Allu Arjun Pushpa: ‘పుష్ప’లో బన్నీకి తల్లిగా నటించిన ఆమె ఎంత స్టైలిష్ గా ఉందో చూశారా?

    దీప్తి పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేశారు. సదరు కామెంట్స్ షన్నుని ఉద్దేశించే అంటున్నారు. సిరితో మితిమీరిన రిలేషన్ నడిపిన షన్నుతో దీప్తి బ్రేకప్ అయ్యే ఆలోచనలో ఉన్నారని, సదరు సోషల్ మీడియా పోస్ట్స్ సారాంశం అదే అంటున్నారు. అయితే అప్పుడే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. మరికొన్ని రోజుల్లో వీరి రిలేషన్ పై పూర్తి క్లారిటీ రానుంది.

    Also Read: Mahesh Babu: ఎన్టీఆర్ తో కృష్ణకు ఎక్కడ చెడింది… మహేష్ ని బాలయ్య అడుగుతాడా?

    Tags