Hero Siddharth: పాన్​ఇండియా కాన్సెప్ట్ ఫేక్​.. హీరో సిద్ధార్థ్​ సంచలన ట్వీట్​

Hero Siddharth: ఇటీవల కాలంలో టాలీవుడ్​ హీరో సిద్దార్థ్​ సోషల్​మీడియాలో సూపర్ యాక్టీవ్​గా ఉంటున్నాడు. రాజకీయ, సినీ పరిశ్రమ, సామాజీక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. నిత్యం హాట్​టాపిక్​లో నిలుస్తున్నారు. మనసులో మాటను నిస్సంకోచంగా చేప్పేస్తుంటాడు. కాగా, ఇటీవలే సమంత- చైతన్యల విడాకులపై సిద్ధు చేసిన ట్వీట్​తో వచ్చిన ఫైర్​ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఎవ్వరి పేరు జోడించకున్నా.. అది సామ్​ కోసమేనని అర్థమవుతోందని నెటిజన్లు తేల్చి చెప్పారు. ఇక తాజాగా, పాన్​ ఇండియా కాన్సెప్ట్​పై […]

Written By: Raghava Rao Gara, Updated On : December 23, 2021 11:19 am
Follow us on

Hero Siddharth: ఇటీవల కాలంలో టాలీవుడ్​ హీరో సిద్దార్థ్​ సోషల్​మీడియాలో సూపర్ యాక్టీవ్​గా ఉంటున్నాడు. రాజకీయ, సినీ పరిశ్రమ, సామాజీక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. నిత్యం హాట్​టాపిక్​లో నిలుస్తున్నారు. మనసులో మాటను నిస్సంకోచంగా చేప్పేస్తుంటాడు. కాగా, ఇటీవలే సమంత- చైతన్యల విడాకులపై సిద్ధు చేసిన ట్వీట్​తో వచ్చిన ఫైర్​ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఎవ్వరి పేరు జోడించకున్నా.. అది సామ్​ కోసమేనని అర్థమవుతోందని నెటిజన్లు తేల్చి చెప్పారు.

ఇక తాజాగా, పాన్​ ఇండియా కాన్సెప్ట్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. అసలు పాన్​ ఇండియా అనేది మోసమంటూ షాకింగ్​ కామెంట్లు చేశాడు. ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ రిపోర్టులను ఫడ్జింగ్​ చేయడానికి రేటెంతో తెలుసా?. నిర్మాతలు చాలా కాలంగా బాక్సాఫీసు లెక్కల గురించి నిజాలు చెప్పడం మానేశారు. అన్ని భాషల్లోని సినీ పరిశ్రలు ఇలాగే ఉన్నాయి.. అసలు పాన్​ ఇండియా అనే కాన్సెప్ట్ మోసం అంటూ ట్వీట్​ చేశాడు.

https://twitter.com/Actor_Siddharth/status/1473547222801260546?s=20

ప్రస్తుతం సిద్ధార్త్ ట్వీట్స్ నెట్టింట వైరల్​గా మారాయి. అసలు సిద్ధార్థ్​ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు?.. ఎవరి గురించి మాట్లాడుతున్నారన్న అంశంపై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఇక కొంత మంది అభిమానులైతే. మీ హీరో గురించే అంటే మీ హీరో గురించంటూ.. సోషల్​మీడియాలో ఫైట్స్ చేస్తున్నారు. మరికొంతమంది సిద్ధార్థ్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ కి సినిమాలు లేక.. అందరి అటెన్షన్​ను తనవైపు తిప్పుకునేందుకే ఇలా కాంట్రవర్సీ ట్వీట్లు చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఏదేమైనా సిద్ధార్థ్​ తన అభిప్రాయాలు వెల్లడించడంలో ఎక్కడా కాంప్రమైజ్​ కాడని క్లియర్​గా అర్థమవుతోంది.