https://oktelugu.com/

Karthika Deepam: పగ తీర్చుకుంటున్న మోనిత.. ఏకంగా శ్రావ్య బిడ్డను!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ వాళ్ళ విషయంలో సౌందర్య బాధలో ఉండటంతో అప్పుడే మోనిత వచ్చి తనకు కూడా బాధ ఉందని నేను కూడా బాధపడుతున్నాను అని ఓవర్ గా మాట్లాడటంతో వెంటనే సౌందర్య కోపం గా తనపై అరిచి తనకు గట్టిగా క్లాస్ పీకుతుంది. మరోవైపు కార్తీక్ పిల్లలతో చెట్లు నాటుతుండగా అప్పుడే దీప వచ్చి వారికి సహాయం చేస్తుంది. పక్కనే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2021 / 11:11 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ వాళ్ళ విషయంలో సౌందర్య బాధలో ఉండటంతో అప్పుడే మోనిత వచ్చి తనకు కూడా బాధ ఉందని నేను కూడా బాధపడుతున్నాను అని ఓవర్ గా మాట్లాడటంతో వెంటనే సౌందర్య కోపం గా తనపై అరిచి తనకు గట్టిగా క్లాస్ పీకుతుంది. మరోవైపు కార్తీక్ పిల్లలతో చెట్లు నాటుతుండగా అప్పుడే దీప వచ్చి వారికి సహాయం చేస్తుంది.

    Karthika Deepam Monitha

    పక్కనే ఉన్న శ్రీ వల్లి దీపను బాగా పరిశీలించి తన మెడలో బంగారం లేదని గుర్తుపట్టింది. ఇక దీపను పిలిచి బంగారం గురించి అడగడంతో దీప చెప్పలేకపోతుంది. ఇక శ్రీవల్లి అర్థం అయిందని బాబు ఏడవటంతో ఇంట్లోకి వెళ్తుంది. పిల్లలు కూడా బాబు కోసం ఇంట్లోకి పరిగెత్తుతారు. దీప బంగారం తాకట్టు పెట్టడం తో కార్తీక్ బాధపడతాడు. ఏం చేయలేని పరిస్థితి నాది అంటూ ఎమోషనల్ అవుతాడు.

    Also Read: కార్తీక్ చేతిలో మోనిత బిడ్డ.. తండ్రి ఎత్తుకోవటంతో ఏడుపు ఆపినా బాబు!

    మరోవైపు రుద్రాణి షేట్ జీ నుంచి దీప బంగారు వస్తువులను తీసుకొని దగ్గర ఉంచుకుంటుంది. ఎప్పటికైనా ఈ బంగారం కోసం నా దగ్గరికి రావాలి అంటూ ఏదో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక మోనిత సౌందర్య అన్న మాటలను తలుచుకొని కోపం తో రగిలిపోతుంది. తన కొడుకు గురించి ఆలోచించుకుంటూ ఎక్కడ ఉన్నావు ఆనందరావు అని బాధపడినట్లు కనిపిస్తుంది.

    ఇక దీప, కార్తీక్ పిల్లలతో కలిసి పడుకుంటారు. దీప మాత్రం గతాన్ని తలచుకుని బాధ పడుతుంది. మరోవైపు కార్తీక్ కూడా తన పరిస్థితి దిగజారి పోయిందని బాధపడతాడు. కాసేపు పిల్లలతో మాట్లాడుతుంటారు. ఉదయాన్నే దీపు కనిపించకపోవడంతో శ్రావ్య బాగా ఏడుస్తూ సౌందర్యకు చెబుతుంది. ఇదంత మోనిత పని అని తెలుసుకోవడంతో బాగా బ్రతిమాలుతుంది శ్రావ్య. ఇక వెంటనే మోనిత తానే బాబును దాచిపెట్టానని చెబుతుంది. మొత్తానికి తన పగను మరో రూపంలో తీర్చుకుంటుంది మోనిత.

    Also Read: కార్తీక్ చేతిలో మోనిత బిడ్డ.. తండ్రి ఎత్తుకోవటంతో ఏడుపు ఆపినా బాబు!