https://oktelugu.com/

Deepthi Sunaina: అందాల దీప్తి సునైనా ఆరబోసిందిలా..

సోషల్ మీడియాలో పాపులర్ అయిన తరువాత దీప్తికి బిగ్ బాస్ 2వ సీజన్లో హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. హీరో తనీష్ తో చనువుగా ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకార్లు వచ్చాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 18, 2023 / 11:51 AM IST

    Deepthi Sunaina

    Follow us on

    Deepthi Sunaina: సోషల్ మీడియాతో పాపులర్ అయిన చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్నారు. టిక్ టాక్, షార్ట్ వీడియోస్ వీరికి ఒక రకంగా లైఫ్ ను ఇచ్చాయి అని చెప్పవచ్చు. అలా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో దీప్తి సునైనా ఒకరు. షార్ట్ వీడియో ద్వారా విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ క్యూట్ గాల్ బిగ్ బాస్ హౌస్ లోకీ ఎంట్రీ ఇచ్చి హల్ చల్ చేసింది. ఆ తరువాత కొందరితో ప్రేమాయణం జరిపి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇటీవల దీప్తి సునైనా పేరు బాగా వినిపిస్తోంది. ఈమె సినిమాల్లో పెద్దగా నటించకపోయినా స్టార్ నటీమణులతో సమానంగా గుర్తింపు రావడం విశేషం. లేటేస్టుగా ఆమె గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఆకట్టుకుంటోంది.

    అందం, ఆకర్షణ, అభినయం దీప్తి సునైనా సొంతం. కానీ ఈ అమ్మడు సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అందుకోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. టిక్ టాక్ అందుబాటులోకి రాని సమయంలోనే డబ్స్ బ్యాచ్ ద్వారా ఫేమస్ అయిన ఈమె ఆ తరువాత టిక్ టాక్ వీడియోలు చేసి ఆకట్టుకుంది. ఈ యాప్ బ్యాన్ అయిన తరువాత షార్ట్ వీడియోస్ తో అలరిస్తోంది. షార్ట్ వీడియోల్లో దీప్తీ డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది.ఇలా చాలా వీడియోలు చేసిన తరువాత ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆమకు వెబ్ సీరీసుల్లో నటించే అవకాశం వచ్చింది. వీటితో దీప్తి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

    సోషల్ మీడియాలో పాపులర్ అయిన తరువాత దీప్తికి బిగ్ బాస్ 2వ సీజన్లో హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. హీరో తనీష్ తో చనువుగా ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకార్లు వచ్చాయి. కానీ ఈ భామ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో సుదీర్ఘకాలం పాటు ప్రేమాయణం సాగించింది. వీరి ప్రేమ విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తరువాత బ్రేకప్ చెప్పేసింది.

    లేటేస్టుగా దీప్తి తన లేటేస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇందులో హద్దు పద్దు లేకుండా అందాలు ఆరబోసింది. ఇప్పటికే హాట్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న దీప్తి ఇప్పుడు పగ్గాలు తెంచేసి గ్లామర్ షో చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అవకాశాల కోసమే ఇదంతా చేస్తున్నారని కొందరు అంటుంటే.. తన బ్యూటీనెస్ షో చేయడానికి అని మరి కొందరు కామెంట్ పెడుతున్నాడు. మరి ఇప్పటికైనా ఈ బ్యూటికి సినిమాల్లో అవకాశం వస్తుందా? వేచి చూద్దాం..