https://oktelugu.com/

ప్రభాస్‌ మూవీలో దీపిక పాత్ర రివీల్‌!

‘రాధేశ్యామ్‌’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత అశ్వినీదత్‌ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఆయన అల్లుడు నాగ్‌ అశ్విన్.. ప్రభాస్‌ కోసం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీని ఇప్పటికే సిద్ధం చేశాడు. ప్రభాస్‌ రేంజ్‌ను, వరల్డ్‌ వైడ్‌ అతని ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 06:55 PM IST
    Follow us on


    రాధేశ్యామ్‌’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత అశ్వినీదత్‌ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఆయన అల్లుడు నాగ్‌ అశ్విన్.. ప్రభాస్‌ కోసం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీని ఇప్పటికే సిద్ధం చేశాడు. ప్రభాస్‌ రేంజ్‌ను, వరల్డ్‌ వైడ్‌ అతని ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పక్కా స్క్రిప్టును రాసి పెట్టుకున్నాడట. రాజుకు తగ్గ రాణి అంటూ ప్రభాస్‌ 21వ మూవీ కోసం బాలీవుడ్‌ స్టార్ దీపిక పడుకోన్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌తో పాటు వైజయంతీ మూవీస్‌ అధికారిరంగా ప్రకటించింది.

    Also Read: డైరెక్టర్ తో ఆడుకుంటున్న హీరోలు !

    బాహుబలి, సాహో తర్వాత మన రెబల్‌ స్టార్ మార్కెట్‌ మరింత విస్తృతమవగా… బాలీవుడ్‌ మేటి నటి దీపిక రాకతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్‌ అమాంతం పెరిగింది. ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం ఇచ్చి దీపికను ఎంచుకోవడం ఇప్పటికే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఈ మూవీలో దీపిక రోల్‌ గురించి ఇంట్రస్టింగ్‌ విషయం తెలిసింది. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో ఆమె ఓ డ్యాన్సర్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.ఈ సైస్స్‌ ఫిక్షన్‌ మూవీ ఆ డ్యాన్సర్ చుట్టూనే తిరుగుతుందట. హీరోయిన్‌ పాత్రతోనే అనేక ట్విస్టులు, టర్న్‌లు ఉంటాయని చెబుతున్నారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ పూర్తయిన వెంటనే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని ఇండియా 1983 వరల్డ్‌ కప్ విక్టరీపై వస్తున్న ‘83’ అనే మూవీలో దీపిక హీరోయిన్‌గా నటించింది. ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది.