నామినేటెడ్ పదవుల పంపకం తేలేదెన్నడు?

2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఏడాది గడిచిపోయింది. దీంతో పార్టీనే నమ్ముకున్న నేతలు తమ పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, పార్టీని నమ్ముకొని ఉన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చినపుడు కూడా తమను పట్టించుకోకపోతే ఎలా? అంటూ వైసీపీ నేతలు లోలోపల నిరసన గళం విప్పుతున్నారు. తమగోడును అధిష్టానం పట్టించుకోవడంతో వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ […]

Written By: Neelambaram, Updated On : July 22, 2020 6:30 pm
Follow us on


2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఏడాది గడిచిపోయింది. దీంతో పార్టీనే నమ్ముకున్న నేతలు తమ పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, పార్టీని నమ్ముకొని ఉన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చినపుడు కూడా తమను పట్టించుకోకపోతే ఎలా? అంటూ వైసీపీ నేతలు లోలోపల నిరసన గళం విప్పుతున్నారు. తమగోడును అధిష్టానం పట్టించుకోవడంతో వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

నామినేటెడ్ పదవులతో ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. పార్టీలోని నేతలను సంతృప్తిపరచడానికి, తమ బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే అధికారంలో ఉన్న పార్టీలు ఆయా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తుంటాయని అందరికీ తెల్సిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతున్నా ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉసేత్తడం లేదు. దీంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా నైరాశ్యంలో మునిగిపోతున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి ఏడాదిలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని భావించారు.

Also Read: జగన్ తో ఫైట్.. నిమ్మగడ్డే గెలిచాడు!

నామినేటెడ్ పదవులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం జగన్ ముడిపెట్టడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏదో ఒక నామినేటెడ్ పోస్టు దక్కించుకొని జిల్లాల్లో పెత్తనం చెలాయించాలకున్న నేతలకు ఆ అవకాశం దక్కడం లేదు. ఇప్పటికే ఏడాది కాలం వృథా అయిపోయిందని నేతలు మదనపడుతున్నారు. నామినేటెడ్ పదవులను స్థానిక ఎన్నికల్లో సత్తాచూపించిన నేతలతో భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తుంది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాతే పదవుల పంపకం చేపట్టాలని వైసీపీ నేతలు భావిస్తోంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలు తరుచూ వాయిదా పడుతుండటంతో నామినేటెడ్ పదవులపై ఆశలు నేతలు అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన వారికి కీలకమైన పోస్టులు కట్టబెట్టడంపై నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మాజీఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఓడినా కూడా ప్రతిష్టాత్మకమైన వీఎమ్ ఆర్డీయే చైర్మన్ పదవిని కట్టబెట్టారని, అలాగే మరో కీలక‌మైన సింహాచలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ షిప్ లను కూడా ఇతర జిల్లాల వారికి కట్టబెట్టి పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

Also Read: కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

పదేళ్ళుగా పార్టీ జెండా పట్టిన వారికి పార్టీలో న్యాయం జరగలేదన్న అసంతృప్తిని నేతలు బహిర్గతం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కన్పించకపోవడం వైసీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నాయి. అయితే అధిష్టానం మాత్రం పార్టీని నమ్ముకున్న వారికి తప్పక న్యాయం జరుగుతుందని చెబుతోంది. దీంతో సీఎం జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడుతారనేది చర్చనీయాశంగా మారింది.