Madhuri Dixit Marriage: ‘మాధురీ దీక్షిత్’కి పెళ్లి అనగానే ‘దీపికా పదుకోణె’ తండ్రి రూమ్ లోకి వెళ్లి.. ?

Madhuri Dixit Marriage: మాధురీ దీక్షిత్.. అందంలో అభినయంలో మధురమైన సొగసుల సోయగం ఆమె, ఎనలేని తన అందాల నటనా ధారలతో హిందీ వెండితెరను నిలువెల్లా తడిపిన నిండు పున్నమి తార మాధురీ దీక్షిత్, హిందీ సినీ నీలి అంబరాన మూడు దశాబ్దాలుగా మురిసి మెరిసి పోతూ మైమరిపిస్తున్న తళుకుల రంగుల జాబిల్లి మాధురీ దీక్షిత్. ఎన్నో పాత్రలు మరెన్నో బావోద్వాగాలు, అన్నిటికీ మించి అందాల తుళ్ళింతలు వెరసి.. నేటి మోస్ట్ గ్లామర్ బ్యూటీలు కూడా మాధురీ […]

Written By: Shiva, Updated On : April 7, 2022 12:38 pm
Follow us on

Madhuri Dixit Marriage: మాధురీ దీక్షిత్.. అందంలో అభినయంలో మధురమైన సొగసుల సోయగం ఆమె, ఎనలేని తన అందాల నటనా ధారలతో హిందీ వెండితెరను నిలువెల్లా తడిపిన నిండు పున్నమి తార మాధురీ దీక్షిత్, హిందీ సినీ నీలి అంబరాన మూడు దశాబ్దాలుగా మురిసి మెరిసి పోతూ మైమరిపిస్తున్న తళుకుల రంగుల జాబిల్లి మాధురీ దీక్షిత్.

Madhuri Dixit Marriage

ఎన్నో పాత్రలు మరెన్నో బావోద్వాగాలు, అన్నిటికీ మించి అందాల తుళ్ళింతలు వెరసి.. నేటి మోస్ట్ గ్లామర్ బ్యూటీలు కూడా మాధురీ దీక్షిత్ గ్లామర్ ముందు సరితూగరు. అందుకే.. ఎంత పెద్ద స్టార్స్ అయినా మాధురీ దీక్షిత్ అందానికి అభిమానులే. అయితే.. దీపికా పదుకోణె ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పింది. ఇండియా టుడేకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపికా క్రేజీ కామెంట్స్ చేసింది.

తన తండ్రి ప్రకాష్ పదుకోణె.. మాధురీ దీక్షిత్ కి పెద్ద అభిమాని అని, అయితే.. మాధురీ దీక్షిత్ పెళ్లి తేదీ ప్రకటించినప్పుడు.. ప్రకాష్ పదుకోణె తన గుండె పగిలినట్టు ఫీల్ అయ్యాడని, పైగా ఆ బాధను తట్టుకోలేక కొన్ని గంటల పాటు తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ఒంటరిగా బాధ పడ్డాడు అని’ దీపికా తన తండ్రి ప్రకాష్ పదుకొణె లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.

Also Read: ఎన్టీఆర్ సినిమాకి భారీ బడ్జెట్.. ఎన్ని వందల కోట్లు అంటే..?

అయినా, ఒక్క ప్రకాష్ పదుకొణె మాత్రమేనా.. చాలా మంది బాలీవుడ్ స్టార్లు ఇప్పటికీ ఈ ‘ధక్ ధక్’ గర్ల్‌ పై మనసు పారేసుకుంటూనే ఉన్నారు. అందుకే.. మాధురీ దీక్షిత్ అందానికి హిందీ బాక్సాఫీస్ దాసోహం అయింది. మొదట్లో ఆమెను దూరం పెట్టిన స్టార్ హీరోలు సైతం.. ఆ తర్వాత ఆమె డేట్లు కోసం పడిగాపులు కాశారు. తెర పై కళ్ళతోనే వయ్యారాలను పండించడంలో విలక్షణ నటి అనిపిచుకుంది మాధురీ.

ముఖ్యంగా గ్లామరస్ రోల్స్ లో మాధురీ దీక్షిత్ తర్వాతే ఎవరైనా.. అలాగే ప్యూర్ లవ్ చిత్రాలతోనూ మెప్పించింది. ఇక ఎమోషనల్ క్యారెక్టర్స్ కు ఆమె పెట్టింది పేరు. భారతీయ తెర పై ఎనలేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న మాధురీ దీక్షిత్, కొన్ని బోల్డ్‌ సీన్స్‌ లో కూడా నటించి మెప్పించింది. అప్పట్లో ఆ సన్నివేశాలు సంచలనం అయ్యాయి. ఏది ఏమైనా అందాల తార దీపికా తండ్రి కూడా మధురమైన మాధురీకి అభిమాని కావడం విశేషం.

Also Read: స్టార్ హీరోయిన్ గా వెలుగొంది.. క‌నుమ‌రుగైపోయిన భామ‌లు వీరే..

https://www.youtube.com/shorts/bXylsKLirok

Tags