AP New District Codes: అన్నీ జగన్ అనుకున్నట్టు గానే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆయన ఢిల్లీకి వెళ్లారో అప్పటి నుంచే కొన్ని విషయాలపై ప్రకటనలు రావడం మొదలయిది. ముఖ్యంగా జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాలకు కేంద్రం నుంచి అధికారిక ఆమోద ముద్ర కోసం ఎప్పటి నుంచో జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఆకాంక్షిచినట్టు డిజిటల్ గా పర్మిషన్ వచ్చినట్టు అయింది.
ప్రస్తుతం ఏర్పడ్డ కొత్త జిల్లాలకు కేంద్రం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్ లను మంజూరు చేసింది. దీంతో అధికారికంగానే జగన్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పర్మిషన్ వచ్చినట్టు అయిపోయింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జిల్లాల మ్యాపింగ్‌కు ఎల్‌జీడీ కోడ్‌లను మంజూరు చేసింది. ఈ కోడ్ ల ఆధారంగానే ప్రభుత్వ పథకాల నుంచి ఉద్యోగాల వరకు అమలు చేస్తారు.
ఈ కోడ్ ల ఆధారంగానే ప్రభుత్వ పాలన సాగుతుంది. ఈక ఈనెల 4 నుంచి కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు అమలులోకి వచ్చాయి. ఇక కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు చూసుకుంటే మన్యం జిల్లాకు 743 కోడ్ వస్తే.. నంద్యాల జిల్లాకు 755 నంబర్ వచ్చింది. ఈ రెండు నెంబర్ల మధ్యలో ఉన్నవి మిగతా జిల్లాలకు ఇచ్చారు. మన దేశంలో ఉన్న ప్రతి జిల్లాకు ఒక కోడ్ ఉంది.
ఈ రకంగా చూసుకుంటే చివరి నెంబర్ ఏపీలోని నంద్యాల జిల్లాకు వచ్చింది. అంటే మన దేశంలో అధికారికంగా 755 జిల్లాలు ఉన్నాయన్న మాట. వాస్తవానికి జనగనణ పూర్తయ్యే వరకు కొత్త జిల్లాలకు మ్యాపింగ్ ఇవ్వొద్దని కేంద్రం గతంలో ఆదేశాలు ఇచ్చింది. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడంతో కేంద్రం జనగణన లేకుండానే మ్యాపింగ్ లకు పర్మిషన్ ఇచ్చింది.
ఇక ప్రస్తుతం వచ్చిన ఈ కోడ్‌లను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో గనక ప్రకటించే విధంగా చేస్తే మాత్రం ఎలాంటి లీగల్ సమస్యలు ఉండవు. అదే జరిగితే జగన్ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి.