Deadpool & Wolverine : హాలీవుడ్ సినిమాల్లో ఉండే గ్రాండీయర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ సినిమాలు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో అత్యద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతు ఉంటాయి. అందుకే సినిమాల టాపిక్ వచ్చిన ప్రతిసారి హాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఇప్పుడు అలాంటి విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘డెడ్ పూబ్లా’ సినిమాలు ఎంత పెద్ద విజయాలను సాధించాయో మనందరికీ తెలుసు.
ఇక ఇప్పుడు ఆ సిరీస్ నుంచే డెడ్ పూల్ & వొల్వారిన్ అనే సినిమా రాబోతుంది. ర్యాన్ రెనాల్డ్స్, హ్యూజ్ జాక్ మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి షాన్ లేవీ దర్శకత్వం వహిస్తున్నాడు… ఇక ఈ సినిమాను మార్వెల్స్ స్టూడియోస్ అండ్ 21 ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఇంతకుముందు ఈ సినిమా నుంచి టీజర్ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రేక్షకులందరిలో నెలకొంది. ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఐతే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్రైలర్ అయితే అద్భుతం గా ఉంది. మరి ఈ సినిమా వరల్డ్ లో ఉన్న చాలా లాంగ్వేజ్ ల్లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సినిమాల్లో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ని క్రియేట్ చేశారు.
కానీ ఈ సినిమాలో చేయబోయే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా ఫ్రెష్ గా, కొత్తగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక దీనిని బట్టి హాలీవుడ్ మూవీస్ పొటెన్షియాలిటీ ఏంటి అనేది మరోసారి ప్రూవ్ అవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూలై 26 న విడుదలవుతుంది. ఇక ఈ సినిమా ఎన్ని వేల కోట్ల వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది …