Homeఎంటర్టైన్మెంట్Deadpool 3 Trailer: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆ చిత్ర ట్రైలర్... 24 గంటల్లో ఎన్ని...

Deadpool 3 Trailer: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆ చిత్ర ట్రైలర్… 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ అంటే?

Deadpool 3 Trailer: ట్రైలర్ సక్సెస్ మీద సినిమా ఫలితం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. సినిమా మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ బాగుంటే సినిమా ఫస్ట్ డే వసూళ్లు గ్రాండ్ గా ఉంటాయి. అందుకే ట్రైలర్ కట్ విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆసక్తికర అంశాలు జోడించి ప్రేక్షకుల్లో సినిమా పట్ల అంచనాలు ఏర్పడేలా చేస్తారు. ట్రైలర్ నచ్చితే మిలియన్స్ వ్యూస్ దక్కుతాయి. తాజాగా ఓ చిత్ర ట్రైలర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.

హాలీవుడ్ సూపర్ హీరోస్ యాక్షన్ ఎంటర్టైనర్ డెడ్ పూల్ 3 ట్రైలర్ దుమ్మురేపుతోంది. మార్వెల్ కామిక్స్ లో భాగం సూపర్ హీరో పాత్రలతో డెడ్ పూల్ 3 తెరకెక్కింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో డెడ్ పూల్ 3 కూడా ఒక చిత్రం. 2016లో డెడ్ పూల్ ఫస్ట్ పార్ట్ విడుదలైంది. మొదటి పార్ కి టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. డెడ్ పూల్ 1 మంచి విజయం సాధించింది.

దానికి కొనసాగింపుగా 2018లో డెడ్ పూల్ 2 తెరకెక్కించారు. డెడ్ పూల్ 2 చిత్రానికి డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించారు. ఈ రెండు భాగాలకు కొనసాగింపుగా డెడ్ పూల్ 3 తెరకెక్కుతుంది. డెడ్ పూల్ 3 జులై 26న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రొమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. డెడ్ పూల్ 3 ట్రైలర్ కి విశేష స్పందన దక్కింది. కేవలం 24 గంటల్లో వరల్డ్ రికార్డు నమోదు చేసింది.

డెడ్ పూల్ 3 ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో 365 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇది వరల్డ్ రికార్డు అని చెప్పాలి. డెడ్ పూల్ 3 ట్రైలర్ తర్వాత రెండో స్థానంలో స్పైడర్ మాన్ నో వే హోమ్ 355 మిలియన్స్ తో ఉంది. ఇక మూడో స్థానంలో అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం ఉంది. ఈ మూవీ 289 మిలియన్ వ్యూస్ రాబట్టింది. డెడ్ పూల్ 3 షాన్ లెవీ దర్శకుడు. రియాన్ రెనాల్డ్స్, జాక్ హు మ్యాన్ ప్రధాన పాత్రలు చేశారు.

 

MARVEL'S DEADPOOL 3 AND WOLVERINE Official Trailer (2024)

Exit mobile version