https://oktelugu.com/

Rare Pregnancy: ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి.. ఎలా సాధ్యమంటే?

కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన జెస్సికా ఇటీవల గర్భం దాల్చింది. తొమ్మిది నెలల తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది. ఇలా గడిచిన తర్వాత ఆరు నెలలకే మరో బాబుకు జన్మనిచ్చింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 15, 2024 / 08:10 AM IST

    Rare Pregnancy

    Follow us on

    Rare Pregnancy: సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చి.. తొమ్మిది నెలల అనంతరం బిడ్డకు జన్మనిస్తుంది. కొన్నిసార్లు జన్యువుల్లో జరిగే మార్పులు.. కుటుంబ నేపథ్యం వల్ల కవలలకు జన్మనిస్తుంది. కానీ అరుదైన సందర్భాల్లోనే ట్రిప్లెట్స్ కు జన్మిస్తుంది. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆరు నెలల్లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అక్కడున్న వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

    కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన జెస్సికా ఇటీవల గర్భం దాల్చింది. తొమ్మిది నెలల తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది. ఇలా గడిచిన తర్వాత ఆరు నెలలకే మరో బాబుకు జన్మనిచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం ఆమె కుటుంబ సభ్యులవంతయింది. మొదటి బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె మామూలుగానే ఉంది.. కొంతకాలానికి ఆమె శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పాలు కూడా సరిగ్గా రాకపోవడంతో వైద్యుడిని సంప్రదించింది. దీంతో అతడు ఆమెను పరీక్షించి గర్భం దాల్చారని చెప్పారు. లోపల పిండానికి మూడు నెలల వయసు ఉందని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా జెస్సికా షాక్ కు గురైంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే వారు నమ్మలేదు.. ఇలా రోజులు గడుస్తున్న కొద్ది పిండం పెరిగింది. సరిగ్గా మొదటి కాన్పు జరిగిన ఆరు నెలలకు రెండవ శిశువు జన్మించింది.

    వాస్తవానికి వైద్య పరిభాషలో ఈ ఘటనను “సూపర్ ఫిటేషన్” అంటారు. ఒక మహిళ గర్భం దాల్చిన తొలి నెలల్లో శృంగారంలో పాల్గొనకూడదు. అలా పాల్గొన్నప్పుడు మరలా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. జెస్సికా కూడా గర్భం దాల్చిన తొలి నెలల్లో తన భర్తతో కలిసి శృంగారంలో పాల్గొంది. దీంతో ఆమె మరలా గర్భం దాల్చింది. అంటే తొలి గర్భం దాల్చిన మూడు నెలలకు ఆమె మల్లి గర్భం దాల్చింది. దీంతో తొలి శిశువు పుట్టిన ఆరు నెలలకు మరో శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఐతే గర్భం దాల్చిన తొలి నెలల్లో శృంగారం లో పాల్గొనకూడదని వైద్యులు సూచిస్తున్నారు. జెస్సికా ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదని.. అదే మిగతా వారి విషయంలో అయితే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఆరు నెలల్లో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంతో జెస్సికా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అక్కడి మీడియా ఈ విషయాన్ని తెగ హైలెట్ చేస్తోంది.