
Dasara Collections : భారీ అంచనాల మధ్య విడుదలైన దసరా మూవీ అదే స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. సాధారణంగా అమెరికాలో మాస్ చిత్రాలకు చెప్పుకోదగ్గ మార్కెట్ ఉండదు. ఈ మధ్య సమీకరణాలు మారిపోయాయి. ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య అక్కడ పెద్ద నంబర్స్ నమోదు చేసింది. ఇక నాని దసరా మూవీలో కెరీర్ బెస్ట్ రికార్డు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
దసరా యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ హాఫ్ మిలియన్ దాటేశాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం $ 550K వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డేనే వన్ మిలియన్ మార్క్ కి దగ్గరవుతుంది. మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్న క్రమంలో దసరా రికార్డు వసూళ్లు సాధించే సూచనలు కలవు. దసరా $ 2 మిలియన్ మార్క్ దాటినా ఆశ్చర్యం లేదు.
దసరా చిత్రాన్ని ఏకంగా 3 వేలకు పైగా థియేటర్స్ లో విడుదల చేశారు. గతంలో బాహుబలి సిరీస్, సాహో, రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే మూడు వేలకు పైగా థియేటర్స్ లో విడుదలయ్యాయి. గతంలో నాని సినిమాల్లో ఏది ఈ స్థాయిలో విడుదల చేయలేదు. దసరా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇతర భాషల్లో కూడా దసరా సినిమాకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
దసరా చిత్రాన్ని రూ. 60 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ చిత్ర విజయం మీద నాని చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన గత చిత్రం అంటే సుందరానికీ దారుణ పరాజయం చవి చూసింది. దీంతో దసరా విజయాన్ని నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Natural star @NameIsNani’s rage erupts at the USA box office 💥💥#Dasara breaches a massive Premieres Gross $550799 and counting @ 7 PM PST! 😎🔥
𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐎𝐩𝐞𝐧𝐢𝐧𝐠𝐬 𝐟𝐨𝐫 𝐍𝐚𝐧𝐢 🤙🏾@SLVCinemasOffl @VjaiVattikuti @PharsFilm @PrathyangiraUS pic.twitter.com/DZc08XoZcQ
— Prathyangira Cinemas (@PrathyangiraUS) March 30, 2023