Hero Nani : ఏడాదికి ఒక్కో స్టార్ హీరో నుంచి వచ్చేది ఒక్క సినిమా మాత్రమే. ఇక కొంతమంది స్టార్లు అయితే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఒక్క న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మరో చిత్రాన్ని చేస్తుంటాడు. కాబట్టి, నానికి ప్లాప్ అండ్ హిట్ లకు సంబంధించి పెద్దగా ఒత్తిడి లేదు. కాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’.
ఈ సినిమా నుంచి ‘స్పార్క్ ఆఫ్ దసరా’ పేరుతో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో నాని మాస్ లుక్ ఆకట్టుకుంటుండగా.. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: Aadhi Pinisetty: ఈ హీరో గారు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా ?
ఇక ఈ చిత్రం దాదాపుగా సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అందుకే నాని ఫోకస్ అంతా ప్రస్తుతం దసరా పై ఉంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. అయితే, ప్రస్తుతం ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పాత్రకు ఒక ఫ్రెండ్ పాత్ర ఉందట. ఈ పాత్ర చాలా కీలకమట.
ప్రస్తుతం ఆ పాత్ర కోసం ఒక పేరున్న హీరోను తీసుకోవాలని మేకర్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నాని స్నేహితుడిగా ఎవరు నటిస్తారో చూడాలి. మొదట ఈ పాత్ర కోసం మరో హీరోని తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఓ దశలో రాజ్ తరుణ్ పేరు కూడా వినిపించింది. కానీ.. ఇప్పుడు మంచు మనోజ్ అయితే ఎలా ఉంటాడు అనే కోణంలో ఆలోచిస్తుంది చిత్రబృందం.
కాకపోతే, మంచు మనోజ్ సైడ్ క్యారెక్టర్ చేయడు కాబట్టి.. ఒకవేళ మనోజ్ చేయను అని అంటే.. రాజ్ తరుణ్ లాంటి హీరోను ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ఏ హీరో నటిస్తాడో చూడాలి. ఈ సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.