Daku Maharaj Trailer Review: బాలయ్య ఈ మధ్య సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్నాడు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…ఇక ఇప్పుడు ఈయన డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు…ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడతాడని అందరూ భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. అయితే గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మొత్తానికైతే బాలయ్య రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎలివేట్ చేస్తూనే, బాబీ మూవీలో ఉండే ఎమోషన్ కి కూడా పెద్ద పీట వేసినట్టుగా ఈ ట్రైలర్ ను చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది… ఇక ట్రైలర్ లో ఒక చిన్న పిల్ల వాయిస్ నుంచి ఈ కథని చెప్పినట్టుగా మనకు ట్రైలర్ అయితే రివిల్ చేశారు. ‘చెడ్డ వాళ్లకు డాకులా కనిపించే ఒక మనిషి మంచి వాళ్లకు మాత్రం మహారాజు’ లా కనిపిస్తాడు అంటూ చిన్న ఎలివేషన్ తో ట్రైలర్ ని ఓపెన్ చేశారు. ఇక విజువల్స్ విషయానికి వస్తే బాలయ్య గత సినిమాలను మించి ఈ సినిమాలో విజువల్స్ అయితే ఉన్నాయి. నిజానికి బాబి ఎంచుకున్న పాయింట్ రోటీన్ గానే అనిపిస్తుంది. అయినప్పటికి ఇప్పటివరకు ఆయన చేసిన కమర్షియల్ సినిమాల జానర్ లోనే ఈ సినిమా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఈ సినిమాలో ఏదో ఒక స్పార్క్ అయితే ఉన్నట్టుగా ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మొత్తం ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బాబీ డియోల్ కనిపించిన షాట్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ముఖ్యంగా బాబి డియోల్ చాలా స్టైలిష్ విలన్ గా కనిపించే ప్రయత్నం అయితే చేశాడు…ఇక తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా సెట్ అయిందనే చెప్పాలి.
మరి మొత్తానికైతే ఈ సినిమా కోసం బాలయ్య బాబు 100% ఎఫర్ట్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. బాబి కూడా తన విజువల్స్ తో ఎక్కడ తగ్గకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైశ్వాల్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఒక రెబల్ క్యారెక్టర్ ని గుర్తు చేస్తుంది. ఆమె కూడా కొంతమంది విలన్స్ తో ఫైట్ చేసినట్టుగా మనకు ఈ ట్రైలర్ లో అయితే కనిపిస్తుంది…ఇక ఇదిలా ఉంటే టైలర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది మాత్రం ఒక డైలాగ్ అనే చెప్పాలి…
అదేంటి అంటే ‘ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నాం… ఏ ఎలుగుబంటో, పులో వస్తే…ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు అమ్మ ‘…అంటూ ఒక చిన్న పిల్ల చెప్పిన డైలాగ్ ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది… ఇక ట్రైలర్ లో బాలయ్య రెండు గెటపుల్లో కనిపిస్తున్నాడు. మరి ఇందులో ఆయన జనానికి సేవ చేసే పాత్రలో అయితే కనిపించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక రౌడీల నుంచి వాళ్లను కాపాడుకుంటూ వచ్చే క్రమంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
రౌడీల వల్ల తన ఫ్యామిలీ ఏ రకంగా సఫర్ అయిందనే విషయాలను ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ ట్రైలర్ ను కనక మనం డీప్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో సాగే సినిమాగా తెలుస్తోంది. అక్కడక్కడ మనకు విక్రమార్కుడు మూవీ ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అక్కడక్కడ కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువైనట్టుగా తెలుస్తోంది…మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఈనెల 12 వ తేదీన వరకు వెయిట్ చేయాల్సిందే…