https://oktelugu.com/

Arogyasri : ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

ఆరోగ్యశ్రీ కొండంత అండ. సామాన్యులు, పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతూ వచ్చాయి. కానీ రేపటి నుంచి ఈ పథకం నిలిచిపోనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 5, 2025 / 11:39 AM IST

    Arogyasri Scheme

    Follow us on

    Arogyasri : ఏపీలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడనుంది. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిల కోసం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ విషయంలో కొద్దిపాటి ఉపశమనం కల్పించాయి. కేవలం ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలను మాత్రమే నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. ఉచిత ఓపి సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు చెబుతున్నాయి. వాస్తవానికి రేపటి నుంచి ఆరోగ్యశ్రీ అన్ని రకాల సేవలను నిలిపివేయాలని భావించాయి. కానీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో ముందుగా ఈ రెండు రకాల సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వంతో చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సంఘం నేతలు తెలిపారు. బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

    * రూ.3 వేల కోట్లు బకాయిలు
    రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 3 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం. వైసిపి హయాంలో 2250 కోట్ల రూపాయల బకాయిలు ఉండేవి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేసింది. అయినా సరే బకాయిలు పేరుకు పోతున్నాయి. ఇలా అయితే ఆసుపత్రుల నిర్వహణ కష్టమని.. సేవలు కొనసాగించలేమని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో మందులు, వైద్య పరికరాలు, రసాయనాల సరఫరాను సంబంధిత వ్యాపారులు నిలిపివేసినట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు ఆసుపత్రులకు సంబంధించి బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ వెళ్తున్నట్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు వారు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు.

    * చర్చలకు ఆహ్వానం
    మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దీనిపై స్పందించింది. నెట్వర్క్ ఆసుపత్రుల సంఘాల ప్రతినిధులకు చర్చలకు ఆహ్వానించింది. దీంతో సేవల నిలిపివేతలపై పునరాలోచనలో పడ్డాయి యాజమాన్యాలు. కేవలం ఓపి, ఈ హెచ్ ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. రేపు చర్చల్లో పురోగతి బట్టి తదుపరి నిర్ణయానికి రానున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు.