CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) సంక్షేమ పథకాల అమలు విషయంలో అనేక రకాలుగా ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. దీనిపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇంకోవైపు ప్రజల్లో కూడా చిన్నపాటి అసంతృప్తి ప్రారంభం అయింది. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సంక్షేమ పథకాల విషయంలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మత్స్యకార భరోసా వంటి మూడు కీలక పథకాల షెడ్యూల్ ప్రకటించారు. దీంతో ఏపీలో సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమైనట్టే.
Also Read: రాజకీయాల నుంచి రాజ్ భవన్ కు.. ఆ సీనియర్ నేత ఆశ ఫలిస్తుందా?
* ఎన్నికల్లో హామీలు
ఈ ఎన్నికల్లో చంద్రబాబు( Chandrababu) చాలా వరకు హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. రెట్టింపు సంక్షేమం అందిస్తామని చెప్పుకొచ్చారు. అవసరం అయితే సంపద సృష్టించి మరి అందిస్తామని తేల్చి చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలకు సంబంధించి అమలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. కేవలం ప్రకటనలు మాత్రమే మిగిలాయి. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షం తో పాటు రాజకీయ ప్రత్యర్థులు సంక్షేమ పథకాల విషయంలో విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లోనే చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
* మత్స్యకారులకు సైతం..
సాధారణంగా మేలో( may month) ఎండలు మండిపోతాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇప్పుడు అదే నెలలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. మత్స్యకారుల వేటనిషేధ సమయంలో అందించాల్సిన భృతితో పాటు రైతులకు ప్రోత్సాహం కింద నగదు అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పేరిట పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు చంద్రబాబు. దీంతో ఈ మే నెల సంక్షేమ పండుగ కొనసాగనుంది.
* ఆ మూడు పథకాలు పేరు మార్చి
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో రైతు భరోసాగా అమలు చేసేవారు. కేంద్రం అందించే ఆరువేల రూపాయల నగదు తో పాటు మరో 7500 అందించి ఆదుకునేవారు. అయితే దానిని 20 వేల రూపాయలకు రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మూడు విడతల్లో అందించేందుకు ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. గతంలో అమ్మ ఒడి పేరిట ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే 15 వేల రూపాయలు అందించేవారు. కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున చదువు ప్రోత్సాహకానికి అందించనున్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే భృతిని కూడా మే నెలలో అందించేందుకు సిద్ధపడుతోంది కూటమి ప్రభుత్వం. మొత్తానికైతే సంక్షేమ పథకాల అమలు ప్రారంభం కావడం శుభపరిణామం.
Also Read: నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చి.. ఏపీ పోలీసులపై పోసాని భార్య సంచలన కామెంట్స్!