https://oktelugu.com/

Daaku maharaj twitter review : డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ : సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య వీర విహారం, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్!

సంక్రాంతి హీరోగా నందమూరి బాలకృష్ణకు అద్భుతమైన రికార్డు ఉంది. మరో సారి ఆయన డాకు మహరాజ్ మూవీతో సంక్రాంతి బరిలో నిలిచారు. జనవరి 12న డాకు మహారాజ్ విడుదలైంది. ప్రీమియర్స్ ముగియగా టాక్ బయటకు వచ్చింది. మరి డాకు మహరాజ్ పట్ల ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటీ?

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2025 / 07:26 AM IST
    Follow us on

    వరుస విజయలతో జోరుమీదున్నారు బాలయ్య. ఆయన నటించిన గత మూడు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఆయన హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించారు. టైటిల్ తోనే ప్రేక్షకులను బాలకృష్ణ ఆకర్షించాడు. ఇక డాకు మహరాజ్ (DAAKU MAHARAAJ)ప్రోమోలు మరింత హైప్ పెంచాయి. పైగా సంక్రాంతి హీరోగా బాలయ్యకు(BALAKRISHNA)ఘనమైన రికార్డు ఉంది. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేసిన హిస్టరీ ఉంది.

    మరి డాకు మహారాజ్ కూడా అలా మ్యాజిక్ చేసిందా? బాలయ్య తన విజయ పరంపర కొనసాగించాడా? ప్రేక్షకుల అభిప్రాయం చూద్దాం. డాకు మహారాజ్ మూవీకి పాజిటివ్ టాక్ రావడం విశేషం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మెప్పస్తుందని అంటున్నారు. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లు డైలాగ్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ దర్శకుడు బాబీ కొల్లి రూపొందించాడట. యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య క్యారెక్టరైజేషన్ బాగున్నాయట. ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం మెప్పించే అంశం అంటున్నారు.

    ఇక సెకండ్ హాఫ్ పర్లేదు. పతకా సన్నివేశాలు బాగున్నాయ్. తమన్ బిజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటున్నారు. బాలయ్యకు మ్యూజిక్ ఇవ్వడం అంటే థమన్ కి పూనకం వస్తుంది. డాకు మహారాజ్ చిత్రానికి థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చాడుట. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. రిచ్ విజువల్స్ తో పాటు కీలక రోల్స్ చేసిన నటులు తమ పాత్రలకు న్యాయం చేశారట. దర్శకుడు బాబీ మాస్ కమర్షియల్ అంశాలు బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు డిజైన్ చేశారని అంటున్నారు.

    అదే సమయంలో డాకు మహారాజ్ మూవీలోని నెగిటివ్ కామెంట్స్ సైతం ఆడియన్స్ సోషల్ మీడియావేదికగా ప్రస్తావిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోరింగ్ గా సాగుతాయి. సెకండ్ హాఫ్ అంత గొప్ప గా లేదు. ప్రిడిక్టబుల్ స్టోరీ. అంతగా మెప్పించలేదు. ఇది ఒకసారి చూడదగ్గ చిత్రం, అంటున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. ప్రగ్యా, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రాతేలా హీరోయిన్స్ గా నటించారు.