
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 18 సంవత్సరాలు నిండిన అందరికి కేంద్రం వ్యాక్సిన్ వేయడానికి నిర్ణయించుకుంది. దీంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఒక్క పైసా ఖర్చు లేకుండా 75 శాతం వ్యాక్సిన్లు ఉచితంగా సరఫరా చేయడానికి నిర్ణయించారు. మిగిలిన 25 శాతం మాత్రం ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చినప్పటికి అక్కడ కూడ రూ. 150 మించకుండా రుసుము వసూలు చేసే విధంగా రూల్స్ తీసుకొచ్చారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. మోడీ నిర్ణయం పట్ల అన్ని వర్గాలనుంచి హర్షం వ్యక్తం అవుతూ ఉండగా వైఎస్సార్ సీపీ అనుకూల మీడియా మాత్రం జగన్ చేసిన డిమాండ్ వల్లే మోడీ ఈ నిర్థయాన్ని తీసుకున్నారు అంటూ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. అన్నిరాష్ర్టాలు ఒక్క తాటిపై ఉండి వ్యాక్సిన్ పై ఒకే పాలసీ ఉండేలాగా కేంద్రానికి విన్నవించాలని నిర్ణయించారు. మోడీ దేశం మొత్తానికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రచారం చేశారు. జగన్ కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన మోడీకి విషయంలో రాసిన ఒకే లేఖలో కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఎక్కడా కోరలేదు. కేవలం ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయాలని మాత్రమే ఆయన ఆ లేఖలో కోరారు.
వైసీపీ అనుకూల మీడియా చేసిన ఈ ప్రయత్నానికి ఆ పార్టీ వీరాభిమానుల నుంచి కూడా సానుకూలత లభించడం లేదు. ఇలాంటి వాటి వల్ల అనవసరంగా జనంలో పలుచన కావడం తప్పించి ప్రయోజనం ఏమీ లేదని తెలుస్తోంది. మీడియాలో వచ్చే వాటికి వాస్తవికత ఉండాలని సూచిస్తున్నారు.