Credit only to Mega Nephews !
కాకపోతే నిర్మాతలు – ఓటిటీ సంస్థకు మధ్య ఇంకా ఆర్ధిక లావాదేవీలు కొనసాగుతున్నాయట. వైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమాతోనే మంచి మార్కెట్ క్రియేట్ అయింది. నిజానికి ఏ యాక్షన్ కథతోనే లేక కామెడీ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ లాంచ్ అయితే.. రెగ్యులర్ సినిమా మాదిరిగానే ఉప్పెన మార్కెట్ కూడా ఉండేది. కానీ ఓ విభిన్నమైన విషాదఛాయలు ఉన్న పాత్రలో వైష్ణవ్ కనిపించబోతుండటం, పైగా హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని టాక్ రావడం.. ముఖ్యంగా సినిమా పాయింట్ మరీ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుండటంతో ఈ సినిమాకి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఓ విషాద వంతమైన ప్రేమ కథకు అదీ కొత్త హీరో సినిమాకి భారీ ఆఫర్ రావడం అంటే, అది వైష్ణవ్ తేజ్ కి మాత్రమే దక్కిన క్రెడిట్ అది.
ఇక ఈ సినిమా పాయింట్ కి వస్తే డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. కొట్టి భయపెట్టినా తన ప్రేమను వదిలిపెట్టట్లేదని ఏకంగా ఆ హీరో మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారట. పాయింట్ వింటుంటేనే మరీ వైల్డ్ గా ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ మెగా యంగ్ హీరోకి మెగా హిట్ వస్తోందేమో చూడాలి. హిట్ వచ్చినా రాకపోయినా ఆల్ రెడీ వైష్ణవ్ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో వినూత్నమైన సినిమా చేస్తున్నాడు.
Also Read : ‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు !