Mega heroes : మెగా హీరోలకు ఏమైంది? ఒకప్పటి బాక్సాఫీస్ కింగ్స్ వసూళ్ళలో ఎందుకు వెనకబడుతున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన మెగా హీరోల సినిమాల ఫలితాలు చూస్తే ఆందోళన కలగక మానదు. చిరంజీవి అనే లెజెండ్ సృష్టించిన మెగా సామ్రాజ్యంలో అరడజనుకు పైగా హీరోలు పుట్టుకొచ్చారు. వీరిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అతిపెద్ద స్టార్స్ గా వెలుగొందుతున్నారు. అల్లు అర్జున్ సైతం మెగా హీరోనే. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యాన్స్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ విడిపోయారని చెప్పొచ్చు. మెగా హీరోల సినిమాలను అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ సినిమాలను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడమే ఇందుకు నిదర్శనం. ఆ వివాదం అటుంచితే.. మెగా హీరోలకు గడ్డు కాలం నడుస్తోంది.
Also Read: ఫ్యాన్స్ ఆగ్రహం..’హరి హర వీరమల్లు’ సెకండ్ హాఫ్ లో ఆ సన్నివేశాలను తొలగించేశారా?
చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ ఇటీవల చేసిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. చిరంజీవి విషయానికి వస్తే… వాల్తేరు వీరయ్య తర్వాత ఆయన నటించిన ఆచార్య, భోళా శంకర్ డిజాస్టర్స్ అయ్యాయి. పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చాయి. పైగా అభిమానులే పెదవి విరిచారు. భోళా శంకర్ రీమేక్ కాగా, దయచేసి రీమేక్స్ చేయవద్దని హితవు పలికారు. ఇక వాల్తేరు వీరయ్య లో రవితేజ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేయగా, ఆయనకు కూడా హిట్ క్రిడిట్ ఇవ్వాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అనంతరం చేసిన వకీల్ సాబ్ ఓ మోస్తరు లాభాలు పంచగా… భీమ్లా నాయక్ జస్ట్ బ్రేక్ ఈవెన్ దాటి కొన్ని ఏరియాల్లో కొద్దో గొప్పో లాభాలు ఇచ్చింది. లేటెస్ట్ రిలీజ్ హరి హర వీరమల్లు ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అది ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపింది. ఫస్ట్ డే హరి హర వీరమల్లు వరల్డ్ వైడ్ రూ. 60-70 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవంలో ఈ ఫిగర్ ఇంకా తక్కువే ఉంటుందని అంచనా.
Also Read: వార్ 2 ట్రైలర్ Jr NTR ఫాన్స్ ని ఇంప్రెస్ చేసిందా?
రెండో రోజు హరి హర వీరమల్లు ఏ స్థాయిలో పడిపోయింది అంటే… తెలుగు రాష్ట్రాల్లోనే 20%-30% శాతం ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం అందుతుంది. దాదాపు రూ. 150 కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ హరి హర వీరమల్లు గట్టెక్కదు. ప్రస్తుత ట్రెండ్ రీత్యా అది అసాధ్యమే. భారీ నష్టాల దిశగా హరి హర వీరమల్లు వెళుతుంది. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన రామ్ చరణ్ కి ఆచార్య, గేమ్ ఛేంజర్ షాక్ ఇచ్చాయి. గేమ్ ఛేంజర్ నష్టాలు వందల కోట్లలో నమోదు అయ్యాయి.
ఇక టైర్ టు హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ల పరిస్థితి దారుణంగా ఉంది. గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలైంటైన్, మట్కా చిత్రాలకు కనీస ఆదరణ దక్కలేదు. మట్కా వరుణ్ తేజ్ కెరీర్లో ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది. విరూపాక్ష తో ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ అయ్యాడు అనుకుంటే… బ్రో రూపంలో ప్లాప్ పడింది. ఇక ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కి హిట్ లేదు. రంగ రంగ వైభవంగా, ఆదికేశవ నిరాశ పరిచాయి.
Also Read: బోయపాటిపై ఒంటికాలిపై లేచిన బాలయ్య?
మెగా హీరోలు నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ కావడం వెనుక కారణం ఏమిటీ? సబ్జెక్ట్స్ ఎంపిక అనేది ప్రధాన కారణం. సినిమాలో విషయం ఉంటే ఎవరూ సినిమాను ఆపలేరు. హరి హర వీరమల్లు అవుట్ ఫుట్ చూసిన పలువురు అభిమానులను గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అనే విమర్శలు చేస్తున్నారు. ఏది చేసినా మన ఫ్యాన్స్ చూస్తారు అనుకుంటే పొరపాటే. సగటు ఆడియన్స్ చూడకుండా సినిమాకు లాభాలు రావు. అదే సమయంలో ఓ వర్గం మెగా హీరోల సినిమాలను టార్గెట్ చేయడం కూడా కారణం. రాజకీయాల కారణంగా మెగా ఫ్యామిలీకి ఓ వర్గం దూరమైంది అనే భావన లేకపోలేదు.
హరి హర వీరమల్లు పరాజయాన్ని అభిమానులే ఒప్పుకుంటున్నారు. ఓజీ లో యాంటీ ఫ్యాన్స్ కి సమాధానం చెబుతామని కౌంటర్లు ఇస్తున్నారు. మరి చూడాలి ఓజీ తో అయినా పవన్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టి మెగా అభిమానులు కాలర్ ఎగరేసేలా చేస్తాడేమో..