Vaishnav Tej : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సోదరుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), తన మొదటి సినిమా ‘ఉప్పెన'(Uppena Movie) తో ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో 60 కోట్ల రూపాయలకు పైగా షేర్, వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి సినిమాతోనే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కాబట్టి, ఇక వైష్ణవ్ తేజ్ కెరీర్ రాబోయే రోజుల్లో వేరే లెవెల్లో ఉండబోతుందని మెగా అభిమానులు ఆశించారు. కానీ ఆ సినిమా తర్వాత సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల వరుస డిజాస్టర్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే మొదటి సినిమా ఉప్పెన తోనే వైష్ణవ్ తేజ్ కి నటుడిగా మంచి పేరొచ్చింది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయిన సక్సెస్ అవుతాడని నమ్మకం మెగా అభిమానులకు కల్పించాడు.
Also Read : మెగా బ్రదర్స్ చిన్నల్లున్ని పట్టించుకోవడం లేదా?
ఇదంతా పక్కన పెడితే ‘ఉప్పెన’ సినిమా ద్వారానే కృతి శెట్టి(Krithi Shetty) టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోత, నటన, హీరోతో చేసిన రొమాన్స్ అప్పట్లో సెన్సేషన్. అయితే ఈ క్యారక్టర్ కోసం ముందుకు సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్(Shivani Rajashekar) ని అడిగారట. సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉంటాయి, లిప్ లాక్స్ చేయాల్సి వస్తుంది అని చెప్పడంతో, నాకు అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని, చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతానని, మా తల్లిదండ్రుల ముందు తల ఎత్తుకోలేనని చెప్పిందట. దీంతో డైరెక్టర్ ఆమెని పక్కన పెట్టి కృతి శెట్టి ని తీసుకున్నారు. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో అయితే విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.
శివాని రాజశేఖర్ ఒప్పుకొని ఈ సినిమా చేసుంటే ఈరోజు ఆమె రేంజ్ వేరే లెవెల్లో ఉండేది. సినిమా అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలి, ఎలాంటి సన్నివేశంలో అయినా నటించాలి, ఆ రెండిటికి సిద్ధంగా లేకుంటే అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావడం వృధా అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. శివాని రాజశేఖర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ కమర్షియల్ గా ఒక్క సక్సెస్ ని కూడా చూడలేకపోయింది. తేజ సజ్జ తో చేసిన ‘అద్భుతం’ అనే చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత, అంతకు ముందు చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఫలితంగా ఈమె ఎక్కడైతే తన కెరీర్ ని మొదలు పెట్టిందో, అక్కడే ఆగిపోయింది. భవిష్యత్తులో సక్సెస్ ని చూస్తుందా లేదా అనేది దానిపై కూడా క్లారిటీ లేదు.
Also Read : హాట్ హీరోయిన్ తో పంజా వైష్ణవ్ తేజ్ ప్రేమాయణం.. డేటింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారుగా!