IPL 2022 Schedule: ఇండియాలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి దాకా అందరూ క్రికెట్ లవర్సే. అయితే రెండేండ్లు క్రికెట్ స్టేడియాలకు వెళ్లకుండా క్రికెట్ లవర్స్ చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంతగానో ఎదర చూస్తున్న ఐపీఎల్ లీగ్‌కు ఎట్టకేలకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది బీసీసీఐ.

వచ్చే నెల మార్చి మార్చి 26 నుంచి ఈ సీజన్ స్టార్ట్ కాబోతోంది. మే 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. కాగా ఈ సారి మాత్రం 40 శాతం మంది అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో 10జట్లు తలపడనున్నాయి. అయితే ఇక్కడే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కేవలం ఒక్క జట్టు కోసమే ఇదంతా చేస్తున్నారంటూ అందరూ మండిపడుతున్నారు.
Also Read: సినీ పరిశ్రమపై జగన్ కు ఎందుకంత కోపం?
ఈసారి 74 మ్యాచులు జరుగుతుండగా.. ఇందులో దాదాపు 55 మ్యాచులు ముబైలోనే జరుగుతున్నాయి. పైగా ముంబై ఇండియన్స్‌కు హోం గ్రౌండ్ అయిన వాంఖడేలోనే జరగడంతో మిగతా ప్రాంచైజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ముంబై ఇండియన్స్‌కు ఈ వాంఖడే స్టేడియం హోమ్ గ్రౌండ్ లాంటిది. ఇక్కడ ఆడితే ఆ జట్టుకే ఎక్కువ లాభం అని బీసీసీఐ ముందు విజ్ఞప్తులు ఉంచుతున్నాయి.

అలా కాకుండా పుణె ఈ మ్యాచులు నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతర లేదని బీసీసీఐకు అన్ని ప్రాంచైజీలు వెల్లడించాయంట. ఈ వాంఖడే స్టేడియంలో రోహిత్ సేనకు మంచి పట్టుంది. పైగా ముంబైలో ఉండే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి రోహిత్ సేనకు మద్దతు తెలుపుతారు కాబట్టి.. ఇక్కడ వద్దని కోరుతున్నారంట. ముంబై ఇండియన్స్ ఆడే నాలుగు మ్యాచ్‌లను వాంఖడేలోకాకుండా పూణెలో నిర్వహించాలని కోరుతున్నాయంట ప్రాంచైజీలు. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు చాలామంది ఒక్క జట్టు కోసం బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని కామెంట్లు చేస్తున్నారంట.
Also Read: సరికొత్త ఛాలెంజింగ్ పాత్రలో సుహాసిని.. షాకింగ్ లుక్