Tollywood: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో జర్రా జర్రా అంటూ ఓ ప్రత్యేక గీతంలో నటించి మెప్పించింది యంగ్ బ్యూటీ డింపుల్ హయతి. ఆ తర్వాత హీరోయిన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి అమ్మడుకు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’లో ఆమె నటిస్తోంది. అయితే తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీకి గతంలో రంగు తక్కువ అని సినిమాల్లో తిరస్కరించారట. ఇక తనకు వచ్చిన ఐటెం సాంగ్స్ ఛాన్స్ లను తాను తిరస్కరించినట్లు ఈ బ్యూటీ తెలిపింది. నటనకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంచుకుంటున్నట్లు వెల్లడించింది.
Tollywood
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ ప్రాజెక్టు ‘గని’. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్న వరుణ్.. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలిపాడు. వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు నిర్మించారు.
అలాగే మరో క్రేజీ అప్ డేట్ సంగతికి వస్తే.. నాగ చైతన్య ‘మానాడు’ అనే సినిమాతో మంచి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. అన్నట్టు ‘మానాడు’ రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది. సురేష్ బాబు చైతో ఈ సినిమా చేయడానికే ‘మానాడు’ రీమేక్ రైట్స్ కొన్నాడట.