https://oktelugu.com/

Pushpa: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !

Pushpa: పుష్ప అని టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రాగానే.. ఇదేదో హీరోయిన్ పేరు చుట్టూ సినిమా నడుస్తోందేమో అని అనేక కథనాలను గాసిప్ రాయుళ్లు అల్లేసి.. ఇదే పుష్ప లవ్ ట్రాక్ అంటూ లేనిపోని పుకార్లు పుట్టించారు. సరే.. ఆ తర్వాత బన్నీ లుక్ అండ్ టీజర్లు.. చివరకు ట్రైలర్ రిలీజ్ అయ్యాక, అసలు పుష్ప లవ్ ట్రాక్ గురించి పట్టించుకోవడమే మానేశారు. అయితే, ‘పుష్ప’ లవ్ ట్రాక్ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 03:09 PM IST
    Follow us on

    Pushpa: పుష్ప అని టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రాగానే.. ఇదేదో హీరోయిన్ పేరు చుట్టూ సినిమా నడుస్తోందేమో అని అనేక కథనాలను గాసిప్ రాయుళ్లు అల్లేసి.. ఇదే పుష్ప లవ్ ట్రాక్ అంటూ లేనిపోని పుకార్లు పుట్టించారు. సరే.. ఆ తర్వాత బన్నీ లుక్ అండ్ టీజర్లు.. చివరకు ట్రైలర్ రిలీజ్ అయ్యాక, అసలు పుష్ప లవ్ ట్రాక్ గురించి పట్టించుకోవడమే మానేశారు. అయితే, ‘పుష్ప’ లవ్ ట్రాక్ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

    Pushpa love track

    పుష్ప రెండు భాగాలుగా తీసుకురావాల‌ని ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు కథను పూర్తిగా మార్చారు. అయితే, ఆ మార్చే సమయంలో కీలక స‌న్నివేశాలు అన్నీ మారిపోయాయి. ఇక పుష్ప‌లో ప్రేమ‌క‌థ‌ కూడా బాగా పెరిగింది. ఎలాగూ సుకుమార్ కి ప్రేమ క‌థల పై ఆసక్తి ఎక్కువ కాబట్టి.. ప్రేమ కథ కోణంలో పుష్పను నడిపిస్తూ పోయారు. దాంతో పుష్పలో లవ్ ట్రాక్ చాలా కీలకం అయిపోయింది.

    మరి తాజాగా వినిపిస్తోన్న అప్ డేట్ ప్ర‌కారం పుష్ప లవ్ ట్రాక్ ఇదేనట. ‘శ్రీ‌వ‌ల్లి – పుష్ఫ‌ల‌కు ముందే పెళ్ల‌యిపోతుందని.. ఆ పెళ్లి ఇటు పుష్ప‌కీ, అటు శ్రీ‌వ‌ల్లికీ ఇష్టం ఉండదు అని తెలుస్తోంది. అలాగే ఒకరికి ఒకరు ఇష్టం లేకపోయినా కలిసి కాపురం చేయాల్సి వస్తోందట. ఆ సమయంలో ఇష్టం లేకుండా వాళ్ళు కాపురం ఎలా చేశారు అనే యాంగిల్ లో వచ్చే సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయట.

    ముఖ్యంగా బన్నీ -రష్మిక మ‌ధ్య వచ్చే ల‌వ్ స్టోరీ తాలూకు సీన్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయట. అన్నట్టు ఈ లవ్ స్టోరీ పార్ట్ 2లో కూడా ఉంటుందట. పైగా పార్ట్ 2 లో లవ్ కి సంబంధించిన కొత్త స‌న్నివేశాలు ఉంటాయని.. మొత్తమ్మీద పుష్ప స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మరి పుష్ప రాజ్ – శ్రీ‌వ‌ల్లిల మ‌ధ్య ప్రేమ‌క‌థ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి.

    Also Read: ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !

    ప్రొడ్యూసర్స్ గా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకువస్తున్నారు. అయితే, హిందీలో పుష్పను ఎవరు పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు సుమిత్ కడేల్ పుష్ప కలెక్షన్స్ హిందీలో 50 లక్షల నుంచి 1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశాడు. నిజంగా కలెక్షన్స్ అలాగే వస్తే.. అప్పుడు డబ్బింగ్ వెర్షన్ కి పెట్టిన డబ్బులు కూడా రావు.

    Also Read: Pushpa: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !

    Tags