https://oktelugu.com/

ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !

Shilpa Shetty: ఏమాటకామాటే.. ఒక హీరోయిన్ తన అందాన్ని, తన ఆరోగ్యాన్ని ముప్పై ఏళ్ల పాటు ఒకేలా కాపాడుకుంటూ రావడం అంటే ఆశ్చర్యకర విషయమే. కానీ ఆ ఆశ్చర్యాన్ని సైతం అబ్బురపరిచింది శిల్పా శెట్టి. కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో ఎలా ఉందో.. నేటికీ అలాగే ఉంది. కాదు, అలాగే తన బాడీని మెయింటైన్ చేస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం విషయంలో ఎన్ని భయాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సమస్యలు.. మరెన్నో బాధలు.. అన్నిటికీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 02:55 PM IST
    Follow us on

    Shilpa Shetty: ఏమాటకామాటే.. ఒక హీరోయిన్ తన అందాన్ని, తన ఆరోగ్యాన్ని ముప్పై ఏళ్ల పాటు ఒకేలా కాపాడుకుంటూ రావడం అంటే ఆశ్చర్యకర విషయమే. కానీ ఆ ఆశ్చర్యాన్ని సైతం అబ్బురపరిచింది శిల్పా శెట్టి. కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో ఎలా ఉందో.. నేటికీ అలాగే ఉంది. కాదు, అలాగే తన బాడీని మెయింటైన్ చేస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం విషయంలో ఎన్ని భయాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    shilpa shetty

    ఎన్నో సమస్యలు.. మరెన్నో బాధలు.. అన్నిటికీ మించి నెత్తి మీదకు వచ్చే బాధ్యతలు.. వీటన్నింటి మధ్య అందాన్ని, ఆ అందం క‌న్నా హుషారును కాపాడుకోవడం కచ్చితంగా అనితరసాధ్యమే. అందుకే, శిల్పా శెట్టికి బారతీయ సినీ లోకంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ద‌శాబ్దాలుగా ఆమె అందాల రాణే. ఆమెతో నటించిన హీరోయిన్లు అమ్మమ్మ వేషాలు వేస్తున్నారు కూడా.

    కానీ, శిల్పా శెట్టికి ఇప్పటికీ హీరోయిన్ గా నటించగలదు. రెండేళ్ల క్రితం వరకూ అక్షయ్ కుమార్ తో నటించింది కూడా. అంతటి సెల‌బ్రిటీ హీరోయిన్ గా చ‌లామ‌ణి అవుతున్న శిల్పా శెట్టి జీవితాన్ని ఒక్కసారిగా ఆమె భ‌ర్త బూతు వ్య‌వ‌హారంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. భర్త అరెస్టు అయి జైల్లో ఉన్న సమయంలో.. శిల్పా శెట్టి ఇల్లు దాట‌లేక మానసికంగా ఎంతో నలిగిపోయింది.

    ముప్పై ఏళ్ళు కాపాడుకున్న అందాన్ని ఆ కష్ట సమయంలో కోల్పోయింది. ఆమె గతంలో లాగా ఫ్రెష్ గా లేదు అని కామెంట్లు వచ్చాయి. అందం పోతే పోయింది, కానీ పరువు కూడా పోయింది.. ఇదే శిల్పా శెట్టిని ఇప్పుడు బాగా బాధ పెడుతుంది. నీలి చిత్రాల వ్య‌వ‌హారంలో శిల్పా ప్రమేయం ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆమె ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించ‌లేదు.

    Also Read: RRR Movie: ఫస్ట్ టైమ్ ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆ పని చేస్తున్న తారక్… ఏంటి అంటే

    కాకపోతే, శిల్పా శెట్టి నమ్మకాన్ని కోల్పోయింది. తనకు సంబంధం లేక‌పోయినా శిల్ప త‌ల వంచుకోవాల్సిన స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ ప‌రిస్థితుల్లో ఆమె భర్త రాజ్ కుంద్రాను కూడా వదిలేయాలని నిర్ణయించుకుంది అని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, నీలి వీడియోల డిస్ట్రిబ్యూష‌న్ కు ఇక వెళ్ళను అని అతను ఆమెను రిక్వెస్ట్ చేశాడు. కానీ ఈ నీలి చిత్రాల గందరగోళంలో చివరకు శిల్పా శెట్టి రెప్యూటేష‌న్ మొత్తం దెబ్బ‌తింది. ఆమెకు ఇప్పుడు గతంలో లాగా అవకాశాలు రావడం లేదు. చివరకు నష్టపోయింది శిల్పా శెట్టి మాత్రమే.

    Also Read: Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…

    Tags