Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan OG: ఓజీ నుండి క్రేజీ అప్డేట్... రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్! పవన్...

Pawan Kalyan OG: ఓజీ నుండి క్రేజీ అప్డేట్… రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్! పవన్ లుక్ కేక

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫుల్ బిజీ. ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. హరి హర వీరమల్లు పీరియాడిక్ డ్రామా. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు ఓజీ టైటిల్ తో ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. సాహో ఫేమ్ సుజీత్ ఓజీ చిత్ర దర్శకుడు. కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. కాగా ఓజీ మూవీ నుండి టీం సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు. చిత్ర విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు.

ఓజీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. విడుదల తేదీ ప్రకటన పోస్టర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. బెల్ బాటమ్ ప్యాంటు, బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అదిరింది. పవన్ ఫ్యాన్స్ నేడు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓజీ టీజర్ విడుదల చేశారు. కత్తి పట్టుకుని ఒంటరిగా ఊచకోత కోస్తున్న పవన్ కళ్యాణ్ విధ్వంసం గూస్ బంప్స్ కలిగించింది. థమన్ బీజీఎమ్ మరింత ఎలివేట్ చేసింది.

పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ ముంబై, జపాన్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. విడుదల తేదీ ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చింది. ఏపీలో ఎన్నికలు ముగిశాక పవన్ కళ్యాణ్ పూర్తి చేసే మొదటి చిత్రం ఓజీ అని తేలిపోయింది. ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఓజీ నిర్మాణం నుండి డివివి దానయ్య తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు టీమ్ చెక్ పెట్టారు. 2024లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలతో ఫ్యాన్స్ ని అలరించనున్నాడు. హరి హర వీరమల్లు త్వరితగతిన పూర్తి చేసిన నేపథ్యంలో అది కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేకపోలేదు.

Exit mobile version