Rakul Preet Singh: ఆల్మోస్ట్ చూపించేసింది బాబోయ్… రకుల్ ని ఇలా చూశాక కుర్రాళ్లకు నిద్ర కరువే!

2016లో రకుల్ కి వరుస హిట్స్ పడ్డాయి. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. దాంతో స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది. ఐదేళ్లు రకుల్ కెరీర్ ఎలాంటి ఢోకా లేకుండా సాగింది.

Written By: Shiva, Updated On : April 28, 2023 6:01 pm
Follow us on

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ బ్యూటీ ప్రస్తుతం హిందీలో చిత్రాలు చేస్తుంది. రకుల్ ప్రీత్ దాదాపు అందరు టాప్ స్టార్స్ పక్కన నటించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో జతకట్టారు. ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రకుల్ కి తెలుగులో మొదటి హిట్. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. గడుసు పిల్ల పాత్రలో రకుల్ అలరించారు.

2016లో రకుల్ కి వరుస హిట్స్ పడ్డాయి. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. దాంతో స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది. ఐదేళ్లు రకుల్ కెరీర్ ఎలాంటి ఢోకా లేకుండా సాగింది. స్టార్డం అనుభవించారు. మహేష్ తో చేసిన భారీ బడ్జెట్ మూవీ స్పైడర్ రకుల్ కి నిరాశపరిచింది. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. రకుల్ తెలుగులో నటించిన చివరి చిత్రం కొండపొలం, వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించిన ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది.

 

అప్పటికే రకుల్ బాలీవుడ్ మీద కన్నేశారు. హిందీలో పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. 2022 లో అటాక్, రన్ వే, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్, డాక్టర్ జీ చిత్రాలు విడుదల చేశారు ఈ ఐదు చిత్రాల్లో ఒకటి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఛత్రీవాలీ టైటిల్ తో ఒక చిత్రం రిలీజ్ చేశారు. ఈ మూవీ నేరుగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఛత్రీవాలీ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

మరోవైపు రకుల్ పెళ్లి వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ఆమె మాత్రం ఇంకా సమయం ఉందంటున్నారు. 2021లో రకుల్ తన ప్రియుడిని పరిచయం చేసింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని మీడియా అడుగుతుంది. ఇక రకుల్ పై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్, ముంబై అధికారులు ఆమెను రెండు సార్లు విచారించారు. ఫిట్ అండ్ స్లిమ్ గా ఉండే రకుల్ డ్రగ్స్ వివాదాల్లో ఎందుకు ఇరుక్కుంటున్నారో అర్థం కాని పరిస్థితి.