https://oktelugu.com/

Virupaksha Collections: ‘విరూపాక్ష’ మొదటి వారం వసూళ్లు.. నైజాం లో కళ్ళు చెదిరే నంబర్స్

ఈ చిత్రం విడుదలై నేటికీ వారం రోజులు పూర్తి అయ్యింది, ఈ వారం రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాలవారీగా ఒకసారి చూద్దాము.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా నైజాం ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి.ఇక్కడ ఈ చిత్రం వారం రోజులకు గాను 11 కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : April 28, 2023 / 06:05 PM IST
    Follow us on

    Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయంగా నిల్చిన సంగతి తెలిసిందే.ఓపెనింగ్స్ దగ్గర నుండే ఈ చిత్రం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. సాయి ధరమ్ తేజ్ గత చిత్రాలకంటే ఎక్కువగా అమెరికా నుండి ఓవర్సీస్ వరకు అద్భుతమైన ఓపెనింగ్ ని దక్కించుకుంది ఈ చిత్రం.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు కి దగ్గరగా వచ్చింది.

    ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 24 కోట్ల రూపాయలకు జరిగింది.మూడు రోజుల్లో 90 శాతం రికవరీ ని సాధించిన ఈ చిత్రం, నాల్గవ రోజుతో వంద శాతం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.

    ఈ చిత్రం విడుదలై నేటికీ వారం రోజులు పూర్తి అయ్యింది, ఈ వారం రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాలవారీగా ఒకసారి చూద్దాము.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా నైజాం ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి.ఇక్కడ ఈ చిత్రం వారం రోజులకు గాను 11 కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఈ వీకెండ్ తో 15 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    అలాగే రాయలసీమ లో కేవలం 50 లక్షల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా, వారం రోజులకు గాను మూడు కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇక ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు ,ఉత్తరాంధ్ర , నెల్లూరు, కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఈ సినిమా 10 కోట్ల 35 లక్షల రూపాయిలు మొదటి వారం లో రాబట్టింది.ఇక ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 7 కోట్ల రూపాయిల షేర్, మొత్తం మీద మొదటి వారం లో 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.