https://oktelugu.com/

Agent Movie Collections: ‘ఏజెంట్’ మొదటి రోజు వసూళ్లు.. మ్యాట్నీ షోస్ నుండి వాష్ అవుట్!

చిత్రానికి విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు, అందుకు కారణం ప్రారంభం లో ఈ చిత్రానికి ఉన్న హైప్ మొత్తం ఆవిరి అయ్యిపోవడమే,రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ నుండి విడుదలకు ముందు రోజు కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

Written By: , Updated On : April 28, 2023 / 05:55 PM IST
Follow us on

Agent Movie Collections: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యి డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.అక్కినేని అభిమానులు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆశలన్నీ చివరికీ ఆవిరి అయ్యాయి. అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సురేందర్ రెడ్డి యేనా అనే సందేహం ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరిలో కలిగింది.

అంత చెత్తగా ఈ చిత్రాన్ని తీశారంటూ అక్కినేని ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు.అఖిల్ కెరీర్ లో ల్యాండ్ మార్కు గా నిలుస్తుందని ఆశించిన ఈ చిత్రం, చివరికి ఇలా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో అభిమానుల బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.అయితే ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు మనం చూడబోతున్నాము .

ఈ చిత్రానికి విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు, అందుకు కారణం ప్రారంభం లో ఈ చిత్రానికి ఉన్న హైప్ మొత్తం ఆవిరి అయ్యిపోవడమే,రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ నుండి విడుదలకు ముందు రోజు కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక విడుదల తర్వాత ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడం తో మార్నింగ్ షోస్ తర్వాత మ్యాట్నీస్ నుండి వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా మొత్తానికి కలిపి ఈ సినిమా కేవలం రెండు హౌస్ ఫుల్ షోస్ ని మాత్రమే రిజిస్టర్ చేసిందట.నైజాం , సీడెడ్ ప్రాంతాలలో కూడా ఓపెనింగ్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకుంది.మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.