https://oktelugu.com/

ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురుకూ కరోనా

బాలీవుడ్‌ సూపర్స్టార్ అమితాబ్‌ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. బిగ్‌బీ కుటుంబంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య నలుగురికి చేరింది. తొలుత తనకు కరోనా సోకిందని అమితాబ్‌ స్వయంగా ట్విట్టర్లో శనివారం వెల్లడించారు. కొన్ని గంటల తర్వాత తనకూ పాజిటివ్‌ అని తేలిందని అభిషేక్‌ బచ్చన్‌ తెలిపాడు. దాంతో అమితాబ్‌ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. తొలుత మిగతా వాళ్లందరికీ నెగిటివ్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ, కొద్దిసేపటికే అభిషేక్‌ భార్య ఐశ్వర్యారాయ్‌, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 12, 2020 11:19 pm
    Follow us on

    Aishwarya, Aaradhya test positive for coronavirus
    బాలీవుడ్‌ సూపర్స్టార్ అమితాబ్‌ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. బిగ్‌బీ కుటుంబంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య నలుగురికి చేరింది. తొలుత తనకు కరోనా సోకిందని అమితాబ్‌ స్వయంగా ట్విట్టర్లో శనివారం వెల్లడించారు. కొన్ని గంటల తర్వాత తనకూ పాజిటివ్‌ అని తేలిందని అభిషేక్‌ బచ్చన్‌ తెలిపాడు. దాంతో అమితాబ్‌ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. తొలుత మిగతా వాళ్లందరికీ నెగిటివ్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ, కొద్దిసేపటికే అభిషేక్‌ భార్య ఐశ్వర్యారాయ్‌, కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ అని తేలిందని తెలిసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఈ రోజు మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు. మిగతా కుటుంబ సభ్యులు జయా బచ్చన్, శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలు అగస్త్య, నవ్యా నవేలిలకు మాత్రం కరోనా సోకలేదని స్పష్టం చేవారు. ‘శ్రీమతి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. శ్రీమతి జయా బచ్చన్‌కు నెగిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. కరోనా బారిన పడ్డ బచ్చన్‌ కుటుంబ సభ్యులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని టవ్ఈట్‌ చేసిన మంత్రి కొద్ది సేపటి తర్వాత దాన్ని డిలీట్‌ చేశారు.

    అమితాబ్ కుటుంబానికి అలానే కరోనా వచ్చింది !

    కాగా, ఐశ్వర్య, ఆరాధ్య నుంచి సేకరించిన తొలి శాంపిల్‌ పరీక్షలో శనివారం రాత్రి నెగిటివ్‌ వచ్చింది. కానీ, నిర్ధారణ కోసం మరోసారి పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ వైరస్‌ సోకిందని తేలింది. అయితే, వారిద్దరిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉండమని సలహా ఇచ్చినట్టు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వర్గాలు తెలిపాయి. అయితే, వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం వారి ఇష్టం అన్నాయి. కాగా, అమితాబ్‌, అభిషేక్‌ ఇద్దరూ ముంబై నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వయసు పైబడిన అమితాబ్‌ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బిగ్‌బీ నివాసం జల్సా, జనక్‌ బంగ్లాలను మున్సిపల్‌ అధికారులు శానిటైజ్‌ చేశారు. ఆయన నివాసంలో సుమారు 54 మంది పని చేస్తున్నారు. వారిలో హై రిస్క్‌ ఉన్న 28 మంది శాంపిల్స్‌ను ఈ రోజు కలెక్ట్‌ చేశారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా వారందరినీ బిగ్‌బీ ఇంట్లోనే క్వారంటైన్‌ చేశారు.