‘నిశ్శబ్దం’ విడుదల పై ఇంకెన్నాళ్ళు నిశ్శబ్దం ?

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ‘నిశ్శబ్దం’ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ కావాలి. కానీ, జనవరి లాస్ట్ వీక్ కి పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత నిర్మాత కోన వెంకట్ కు, ఓ ఛానల్ కు మధ్య సాగిన ఆర్ధిక లావాదేవీల గందరగోళంలో.. పాపం ‘నిశ్శబ్దం’ నిశ్శబ్దంగానే విడుదలకు నోచుకోకుండా, ఏదో అడ్రెస్ లేని వారి సినిమాలగా ల్యాబ్ లోనే మిగిలిపోయింది. సరే, పోనీ ఇప్పుడైనా ఒటిటిలోనైనా […]

Written By: admin, Updated On : July 12, 2020 8:37 pm
Follow us on

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ‘నిశ్శబ్దం’ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ కావాలి. కానీ, జనవరి లాస్ట్ వీక్ కి పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత నిర్మాత కోన వెంకట్ కు, ఓ ఛానల్ కు మధ్య సాగిన ఆర్ధిక లావాదేవీల గందరగోళంలో.. పాపం ‘నిశ్శబ్దం’ నిశ్శబ్దంగానే విడుదలకు నోచుకోకుండా, ఏదో అడ్రెస్ లేని వారి సినిమాలగా ల్యాబ్ లోనే మిగిలిపోయింది. సరే, పోనీ ఇప్పుడైనా ఒటిటిలోనైనా రిలీజ్ అవుతుందా అంటే.. మేకర్స్ మాత్రం థియేటర్స్ లోనే తమ సినిమా అంటూ కాలక్షేపం చేస్తున్నారు.

మరి ‘నిశ్శబ్దం’కు థియేటర్ల మోత ఎప్పుడూ తగులుతుందో అనుష్క అభిమానులకు ఎప్పుడు ఈ సినిమాని చూసే అవకాశం దక్కుతుందో చూడాలి. ఇక యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో మంచి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు అనుష్క, మాధవన్ ల మధ్య నడిచే సస్పెన్స్ ట్రాక్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. మొత్తం క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ అండ్ హారర్ ఎఫెక్ట్స్ ను సినిమాలో బాగా ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడం, పైగా అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించడంతో ఈ సినిమా పై ఆసక్తిని పెంచింది.

అన్నట్టు ఓ మర్డర్ చుట్టూ తిరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మర్డర్ చేసింది ఎవరనే కోణంలో సినిమా సాగుతూ మంచి ఎమోషనల్ కంటెంట్ తో కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందట. పైగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని… ముఖ్యంగా సినిమాలో అనుష్కది నెగిటివ్ క్యారెక్టర్ అని, అయితే చివర్లో పాజిటివ్ గా మారుతుందని తెలుస్తోంది. మరి ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. ‘నిశ్శబ్దం’తో కూడా నిశ్శబ్దంగా హిట్ కొడుతుందేమో చూడాలి.