Chhaava
Chhaava : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విక్కీ కౌశల్(Vicky Kaushal) ‘చావా'(Chaava Movie) చిత్రం, రీసెంట్ గానే తెలుగు వెర్షన్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఊహించిన విధంగానే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రెండవ రోజు కూడా అదే ఊపుని కొనసాగించింది. ముఖ్యంగా బుక్ మై షో లో అయితే టికెట్స్ అమ్మకం విషయం లో కొన్ని గంటలు హిందీ వెర్షన్ ని కూడా డామినేట్ చేసే రేంజ్ లో ఉందంటే, ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. కేవలం సోషల్ మీడియా లో మాత్రమే డిమాండ్ ఉంది, బయట అసలు డిమాండ్ లేదు, అనవసరం గా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అని అనుకున్నారు చాలా మంది.
Also Read : ‘చావా’ తెలుగు వెర్షన్ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ట్రేడ్ కి పెద్ద షాక్..ఇప్పట్లో ఆగేలా లేదు!
కానీ తెలుగు లో ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన ఎన్నో తెలుగు సినిమాల కంటే ఎక్కువ గ్రాస్ ని రాబట్టి సంచలన సృష్టించింది. మొదటి రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 57 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక రెండవ రోజు అయితే ఏకంగా 70 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. కౌంటర్ బుకింగ్స్ కూడా ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ ఉండడం గమనించాల్సిన విషయం. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 81 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈరోజుతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల రూపాయిల మార్కుని టచ్ చేయనుంది. హిందీ లో మూడు వారాల క్రితం విడుదలైన సినిమాకి, తెలుగు లో ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
లాంగ్ రన్ కలిసొస్తే కచ్చితంగా ఈ సినిమాకి కేవలం తెలుగు వెర్షన్ నుండి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరో పక్క ఈ సినిమాకి హిందీ వెర్షన్ లో ఇప్పటి వరకు 516 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. శనివారం రోజున ఈ చిత్రానికి 13 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఈరోజు ఆదివారం కాబట్టి ఎక్కువ వసూళ్లు రావాలి, కానీ నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వెర్సస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఉండడం వల్ల, శనివారం వచ్చిన వసూళ్లే, ఆదివారం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. లేకపోతే కేవలం ఆదివారం రోజున ఈ సినిమాకి 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చేవి. వచ్చే వారం కూడా మంచి థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉన్నందున ఈ సినిమాకి ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : ఛావా (తెలుగు) ఫుల్ మూవీ రివ్యూ…