Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారంటీ సినిమాగా ఆడేది. మన పక్కింటి కుర్రాడిగా ప్రతి ఒక్కరిని మెప్పించిన నాని ఇప్పుడు మాత్రం మాస్ సినిమాలతో మంచి మాస్ ఇమేజ్ ని సంపాదించుకొని స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో గత రెండు సంవత్సరాల క్రితం దసర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాడు. మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే ప్యారడైజ్ అనే సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.
Also Read : నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ఆ హాలీవుడ్ చిత్రానికి రీమేకా? అడ్డంగా దొరికిపోయారుగా..స్టోరీ ఏమిటంటే!
అందులో నాని రెండు జడలు వేసుకుని ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించాడు. అలాగే తన చేయి మీద టాటూ ను చూస్తే ఒక బూత్ టాటు ఉండటం అనేది యావత్ ప్రేక్షకలోకాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఫ్యామిలీ, లవ్, కామెడీ సినిమాలు చేస్తూ ముందుకు సాగే నాని ఇలాంటి సినిమా చేస్తున్నాడు అనగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
నాని తనకంటూ ఒక మాస్ ఇమేజ్ కావాలని మొదటి నుంచి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాతో తనకు ఎనలేని గుర్తింపు వస్తుందంటూ శ్రీకాంత్ ఓదెలను బాగా నమ్ముతున్నాడు. మరి తను చెప్పినట్టుగా చేస్తున్న నాని ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని ఇవ్వడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తన అభిమానిగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
స్టార్ హీరోగా మారాలంటే మాస్ అవతారం ఎత్తాలి అనే విషయాన్ని నాని బాగా వంట బట్టించుకున్నట్టున్నాడు. అందుకోసమే తనకి స్టార్ హీరో ఇమేజ్ రావాలంటే ఇది ఒకటే దారి అని తనను తాను భారీగా మార్చుకొని మరి మాస్ లో ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇకమీదట నాని మొత్తం ఊరమాస సినిమాలే చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ మార్కెట్ ను కొల్లగొట్టి భారీ రికార్డులను సైతం తిరగరాయాలనే ప్రయత్నంలో నాని ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగా భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : దసరా 2 ‘ ఇక లేనట్టేనా..? నాని డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషనే అందుకు కారణమా?