Mark Shankar : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich) నిన్న సింగపూర్ లో అగ్నిప్రమాదానికి గురైన స్కూల్ లో చిక్కుకొని గాయాలపాలైన సంగతి తెలిసిందే. అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించడం తో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. నిన్న మొత్తం అభిమానులు ఏ స్థాయిలో సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారో మనమంతా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా ఊపిరి తిత్తుల్లో నల్ల పొగ చిక్కుకోవడం వల్ల బార్కోస్కోపీ చేస్తున్నారని, రేపు ఉదయం వరకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనేది తెలిసే అవకాశం లేదని నిన్న రాత్రి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. నేడు ఉదయం మార్క్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం అతన్ని ICU వార్డ్ నుండి జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తున్నారని, మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Also Read : ‘చిన్నారి వారియర్ కోలుకోవాలి’..పవన్ చిన్న కొడుకు పై ఎన్టీఆర్ ట్వీట్!
అయితే కాసేపటి క్రితమే మార్క్ శంకర్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియా లో విడుదలైంది. ఇందులో మార్క్ శంకర్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని, రెండు చేతులను చూపిస్తూ ‘నేను బాగానే ఉన్నాను’ అనే సంకేతాలు అందిస్తున్నట్టు, కేవలం అభిమానుల కోసమే ఈ ఫోటోని విడుదల చేశారు. దీంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు. అకిరా నందన్ ని అనేకసార్లు చూసారు కానీ, మార్క్ శంకర్ ని చిన్నప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే అభిమానులు చూడడం. సంవత్సరం కూడా నిండకముందు పవన్ కళ్యాణ్ ఎత్తుకొని తిరగడం, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రెండు మూడు సార్లు విమానాశ్రయం లో తన తల్లి తో కలిసి బుడిబుడి అడుగులు వేస్తూ కనిపించడం చూసారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నారు. ఏది ఏమైనా మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ఇకపోతే మార్క్ శంకర్ కి ప్రమాదం జరిగింది అనే విషయం తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) వంటి వారు పవన్ కళ్యాణ్ తో ఫోన్ కాల్ సంభాషణ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసిన విషయం ఏమిటంటే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా స్పందించి మార్క్ తొందరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ లతో సహా ప్రతీ ఒక్కరు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ ట్వీట్స్ వేశారు. సినీ ఇండస్ట్రీ నుండి జూనియర్ ఎన్టీఆర్ నేడు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మార్క్ శంకర్ త్వరలో కోలుకోవాలని ప్రార్థించాడు. అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరి ఆశీస్సులు చల్లగా ఉండడం వల్ల నేడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడ్డాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల..!