Court Movie Collection: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్’ చిత్రం(Court Movie) ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని, లేకపోతే నా తదుపరి చిత్రం ‘హిట్ 3’ ని థియేటర్స్ లో చూడొద్దు అంటూ నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సవాల్ చేసి మరీ బ్లాక్ బస్టర్ కొట్టి చూపించాడు. ఇది నిజంగా అభినందించ దగ్గ విషయం. మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గతంలో నాని సినిమాకి కూడా ఈ రేంజ్ వసూళ్లు వచ్చేవి కాదు. ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని చిన్న ఆర్టిస్ట్స్ ని హీరో హీరోయిన్స్ గా పెట్టుకొని ఈ రేంజ్ హిట్ కొట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ చిత్రం లో శివాజీ నటనకు ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం.
Also Read: ఒక్క టీజర్ తో 25 కోట్లు..ఆసక్తి రేపుతున్న ‘ఓదెల 2’ మూవీ బిజినెస్!
ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలై మూడు రోజులు పూర్తి అయ్యింది. ఈ మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు తెలుగు రాష్ట్రాల నుండి మూడు కోట్ల రూపాయిలు రాగా, వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే మొదటి రోజు కంటే ఎక్కువ షేర్ వసూళ్లు అన్నమాట. రెండవ రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారిగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి విశ్లేషిస్తే, నైజాం ప్రాంతంలో 4 కోట్ల 65 లక్షల రూపాయిలు రాగా, సీడెడ్ ప్రాంతంలో 55 లక్షలు, ఆంధ్ర ప్రాంతం లో మూడు కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 8 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఓవర్సీస్ లో రెండు కోట్ల 80 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక 60 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి అన్నమాట. ఫుల్ రన్ లో మరో పది కోట్ల రూపాయిల లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సినిమాకి మంచి పాజిటివ్ మౌత్ టాక్ ఉండడంతో కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి 2 ఏళ్ల జైలు శిక్ష..? కారణం ఏమిటంటే!