Soubin Shahir: రీసెంట్ గా కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కూలీ'(Coolie Movie) చిత్రం మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంత చేసుకోవడం తో కావాల్సినంత రేంజ్ కి ఈ సినిమా వెళ్లలేకపోయింది అనేది వాస్తవం. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ ని లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) సరైన ఆర్క్ తో రాసుకోలేదు. నాగార్జున, అమీర్ ఖాన్ క్యారెక్టర్స్ తేలిపోయాయి. రజినీకాంత్(Super Star Rajinikanth) క్యారక్టర్ కి కూడా ఒక సరైన ఆర్క్ లేదని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత బాగా హైలైట్ అయ్యింది మాత్రం సౌబిన్ సాహిర్(Soubhin Sahir) మాత్రమే. సినిమా విడుదలకు ముందు ‘మౌనికా’ అనే పాటకు హీరోయిన్ పూజ హెగ్డే(Pooja Hegde) తో కలిసి ఆయన వేసిన స్టెప్పులను చూసి ఆడియన్స్ కి మతి పోయినంత పని అయ్యింది.
Also Read: బుద్ధి లేదా నీకు అంటూ రిపోర్టర్ పై నాగార్జున ఫైర్.. వీడియో వైరల్!
ఒక విధంగా సినిమా కి హైప్ భారీగా పెరగడానికి ప్రధాన కారణాలలో సౌబిన్ సాహిర్ కూడా ఒకడు. అదే విధంగా సినిమాలో కూడా ఈయన క్యారక్టర్ అద్భుతంగా పేలింది. కేవలం ఈయన కారణంగానే ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా యావరేజ్ రేంజ్ కి చేరింది అని క్రిటిక్స్ సైతం రివ్యూలు ఇచ్చారు. అంతటి టాలెంట్ ఉన్న ఈ సౌబిన్ సాహిర్ అనే వ్యక్తి మలయాళం సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాడు. ‘మంజుమ్మల్ బాయ్స్’ అనే సినిమా ని అంత తేలికగా మనం మర్చిపోగలమా. ఈ సినిమాలో సౌబిన్ సాహిర్ అద్భుతంగా నటించడమే కాదు, ఆ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించి భారీ లాభాలను అందుకున్నాడు. అయితే సక్సెస్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు అని పెద్దలు అనేక సందర్భాల్లో అనుకున్నారు. సౌబిన్ కెరీర్ ని మలుపు తిప్పిన మంజుమ్మల్ బాయ్స్, కష్టాల్లోకి కూడా నెట్టేసింది. ఈ సినిమా విషయం లో ఆయన అరెస్ట్ కావాల్సి వచ్చింది.
బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయనకు ఇప్పుడు దుబాయి కి వెళ్లేందుకు కూడా కోర్టుని అనుమతి ని ఇవ్వలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి సౌబిన్ తో పాటు అతని తండ్రి కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు. వీళ్ళతో పాటు సిరాజ్ అనే ఇన్వెస్టర్ కూడా ఉన్నాడు. ఈయనతో సినిమా ప్రారంభానికి ముందే వచ్చే లాభాల్లో 40 శాతం తనకు ఇవ్వాలని నిర్మాతతో ఒప్పందం చేసుకున్నాడట. కానీ కేవలం 6 కోట్ల రూపాయిలు మాత్రమే ఇచ్చాడని పోలీసులకు సౌబిన్ పై సిరాజ్ ఫిర్యాదు చేసాడు. దీంతో సౌబిన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత మధ్యంతర బెయిల్ మీద విడుదలైన సౌబిన్ కి ఇప్పుడు దుబాయి లో జరగబోతున్న సైమా అవార్డ్స్ లో తనకు వచ్చిన అవార్డుని అందుకోవడానికి వెళ్లేందుకు ఎర్నాకులం కోర్టుని అనుమతి కోరగా, కోర్టు నిరాకరించింది. దీంతో సౌబిన్ తనకు వచ్చిన అవార్డుని తీసుకునే అదృష్టం కోల్పోయాడు పాపం.