Akhanda 2 Release Date: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నాల్గవ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie). 2021 వ సంవత్సరం డిసెంబర్ 2 న విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ తలరాతనే మార్చేసింది. కెరీర్ ముగింపుదశలో ఉన్న ఆయనకు సరికొత్త కెరీర్ ని ఇచ్చింది ఈ చిత్రం. అలాంటి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే అంచనాలు ఉండడం సహజమే. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. ఇక టీజర్ విడుదల తర్వాత ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ 25 న విడుదల చేస్తామంటూ నిన్న మొన్నటి వరకు మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు విడుదల సాధ్యం కాదని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని గత వారంలో అధికారిక ప్రకటన చేశారు.
Also Read: బుద్ధి లేదా నీకు అంటూ రిపోర్టర్ పై నాగార్జున ఫైర్.. వీడియో వైరల్!
అభిమానులను మొదటి నుండి ఊరిస్తూ వచ్చి ఇలా వాయిదా వేయడం పై తీవ్రమైన అసంతృప్తి రేగింది. కానీ ఇప్పుడు కాకపోయినా డిసెంబర్ లో అయినా వస్తుంది, కేవలం రెండు మూడు నెలలు ఓర్చుకుంటే చాలు అని అభిమానులు తమకి తాము సర్దిచెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ లో కూడా రావడం కష్టమేనట. ఎందుకంటే VFX వర్క్ చాలా భారీగా ఉండడమే అందుకు కారణం అని అంటున్నారు. రీసెంట్ గానే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన VFX షాట్స్ డెలివరీ అయ్యాయి అట. వాటిల్లో 50 శాతం కి పైగా VFX షాట్స్ బోయపాటి శ్రీను కి నచ్చలేదట. రీ వర్క్ కోసం తిరిగి పంపేశారట. ఇక సెకండ్ హాఫ్ సంగతి సరేసరి. సెకండ్ హాఫ్ కి సంబంధించిన VFX షాట్స్ ఎప్పుడు డెలివరీ చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు.
డిసెంబర్ మిస్ అయితే బాలయ్య బాబు కి బాగా కలిసొచ్చిన సంక్రాంతికి కూడా ఈ చిత్రం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా కూడా విడుదల కాబోతుంది. ఇలా మూడు సినిమాలతో సంక్రాంతి నిండిపోయింది కాబట్టి, ‘అఖండ 2 ‘ ఉగాదికి కానీ, శివరాత్రికి కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డ్స్ ని నెలకొల్పబోతుంది అనేది. ఈ చిత్రం హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించగా, విలన్ గా ఆది పినిశెట్టి నటించాడు.