https://oktelugu.com/

This week  OTT : ఈ వారం ఓటీటీలో లెక్కకు మించిన సినిమాలు, సిరీస్లు.. ప్రేక్షకులకే పండగే, లిస్ట్!

ఒకవైపు థియేటర్స్ లో పుష్ప 2 సందడి నెలకొననుంది. వేల థియేటర్స్ లో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. అదే సమయంలో ఈ వారం కొన్ని క్రేజీ మూవీస్ ఓటీటీలో విడుదల కానున్నాయి. బ్లాక్ బస్టర్ అమరన్ తో పాటు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : December 3, 2024 / 09:34 PM IST

    This week  OTT

    Follow us on

    This week  OTT :  వారాంతం వచ్చిందంటే మూవీ లవర్స్ కి పండగే. అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్లు అందుబాటులోకి వస్తాయి. ఈ వారం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 విడుదల అవుతుంది. ఏకంగా ఆరు భాషల్లో డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రానుంది. మరోవైపు ఓటీటీలో బ్లాక్ బస్టర్ సినిమాలు, విభిన్నమైన సిరీస్లు స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యాయి. అమరన్, మట్కా తో పాటు ఓటీటీలో అందుబాటులోకి వస్తున్న సినిమాలు ఏమిటో చూద్దాం..

    నెట్ఫ్లిక్స్
    అమరన్-తమిళ మూవీ-డిసెంబర్ 5
    చర్చిల్ యట్ వార్-డాక్యుమెంటరీ-డిసెంబర్ 4
    దట్ క్రిస్టియన్-యానిమేషన్ చిత్రం-డిసెంబర్ 4
    ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా-డాక్యుమెంటరీ మూవీ-డిసెంబర్ 4
    ది అల్టిమేటం-వెబ్ సిరీస్-డిసెంబర్ 4
    బ్లాక్ డవ్జ్ – హాలీవుడ్ మూవీ- డిసెంబర్ 5
    విక్కీ విద్యా కా వో వాలా వీడియో-హిందీ సినిమా-డిసెంబర్-6
    ఎ నాన్సెన్స్ క్రిస్టమస్-హాలీవుడ్ మూవీ-డిసెంబర్ 6
    బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్-హాలీవుడ్ మూవీ-డిసెంబర్ 6
    జిగ్ర-హిందీ మూవీ-డిసెంబర్ 6
    మేరీ-హాలీవుడ్ మూవీ-డిసెంబర్ 6

    అమెజాన్ ప్రైమ్
    మట్కా-తెలుగు సినిమా- డిసెంబర్ 5
    జాక్ ఇన్ టైమ్ ఫైర్ క్రిస్మస్-హాలీవుడ్ మూవీ-డిసెంబర్ 3
    పాప్ కల్చర్ జెప్పడీ-వెబ్ సిరీస్-డిసెంబర్ 4
    అగ్ని-హిందీ సినిమా- డిసెంబర్ 6
    ది స్టిక్కీ-హాలీవుడ్ మూవీ- డిసెంబర్ 6

    జియో సినిమా
    క్రియేట్ కమాండోస్-యానిమేషన్ సిరీస్-డిసెంబర్ 6
    లాంగింగ్ – హోలీవుడ్ మూవీ- డిసెంబర్ 7

    హాట్ స్టార్
    ది ఒరిజినల్-కొరియన్ సిరీస్- డిసెంబర్ 3
    లైట్ షాప్-కొరియన్ మూవీ-డిసెంబర్ 4

    జీ 5
    మేరీ – హిందీ సినిమా- డిసెంబర్ 6

    సోనీ లివ్
    తానవ్ 2-హిందీ /తెలుగు-డిసెంబర్ 6

    బుక్ మై షో
    స్మైల్ 2-హాలీవుడ్-డిసెంబర్ 4