https://oktelugu.com/

AP News : ఏకంగా సోషల్ మీడియాలో పెట్టేశారు.. ఏపీలో డేటా చౌర్యం జరుగుతోందా? పోలీసులు ఏం చేస్తున్నారు?

సోషల్ మీడియాలో ఓ నేటిజన్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.తన వ్యక్తిగత సమాచారాన్ని జనసేన అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై వాపోయాడు.ఇదే క్రమంలో వైసిపి తీవ్రంగా స్పందించింది.రాష్ట్రంలో పెద్ద ఎత్తున డేటా ఉల్లంఘన జరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 3, 2024 / 09:25 PM IST

    Jana Sena fan who posted netizen data

    Follow us on

    AP News :  ఏపీలో డేటా చోరీ జరుగుతోందా? వ్యక్తిగత సమాచారాన్ని బయటకు వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఓ నెటిజన్ తన వ్యక్తిగత సమాచారాన్ని జనసేన నేతలు చోరీ చేశారని ఆరోపిస్తున్నారు.అయితే ఈ డేటా చౌర్యం అనేది ఇప్పటిది కాదు.టిడిపి ప్రభుత్వ హయాంలోనే డేటా చౌర్యం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు.ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసిపి నేతలకు సంబంధించి డేటా పలు ఐపి అడ్రస్లకు వెళ్లినట్లు అప్పట్లో కమిటీ తేల్చింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత గొప్యత సమాచారం బయటకు వెళ్తోందంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.అయితే ఇప్పుడు అదే తరహా ఆరోపణలు రావడం,జనసేనపై రావడం ఆశ్చర్యంగా ఉంది.

    * వైసిపి పోస్ట్
    సోషల్ మీడియాలో ఓ నేటిజన్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.తన వ్యక్తిగత సమాచారాన్ని జనసేన అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై వాపోయాడు.ఇదే క్రమంలో వైసిపి తీవ్రంగా స్పందించింది.రాష్ట్రంలో పెద్ద ఎత్తున డేటా ఉల్లంఘన జరుగుతోంది.సున్నితమైన సమాచారం జనసేన అభిమానుల చేతుల్లోకి వెళ్ళింది.వేధింపుల కోసం దానిని ఉపయోగిస్తున్నారు.పోలీస్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రమాదంలో పడింది.ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతున్నాం అంటూ ట్వీట్ చేసింది వైసిపి.

    * సోషల్ మీడియా వార్ తోనే
    ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన మధ్య గట్టి వార్ జరుగుతుంది. ఈ క్రమంలోఆ రెండు పార్టీలు పోటా పోటీగా పోస్టులు పెట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే మాటలు కోటలు దాటుతున్నాయి.వ్యక్తిగతంగా కామెంట్స్ చేసేదాకా పరిస్థితి వచ్చింది.ఈ తరుణంలోనే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.అయితే ఏకంగా వైసిపి డేటా చౌర్యం జరుగుతుందని చెప్తుండడం ఆందోళన కలిగిస్తోంది.ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.