https://oktelugu.com/

మాజీ హాట్ బ్యూటీకి కరోనా.. ఆ హీరో వల్లే ! 

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకి  ముగింపు ఎప్పుడనేది ఇప్పట్లో ఎవ్వరూ  చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రపంచం. రోజురోజుకూ  కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతోన్నాయి. జనం కూడా కరోనా పాజిటివ్ అనే పదాన్ని తమ రోజువారీ పదాల్లో ఒకటిగా అలవాటు చేసేసుకున్నారు.  మరోపక్క  కరోనాతో పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్న వారూ ఉన్నారు. అయితే చాలామంది పదిహేను రోజులకే కరోనా నుండి బయటపడుతుంటంతో ఓ ధైర్యం వచ్చేసింది జనాల్లో. మొత్తానికి ఈ కరోనా సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా  అందర్నీ కమ్మేస్తూ వస్తోంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 7, 2020 / 05:08 PM IST
    Follow us on

    ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకి  ముగింపు ఎప్పుడనేది ఇప్పట్లో ఎవ్వరూ  చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రపంచం. రోజురోజుకూ  కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతోన్నాయి. జనం కూడా కరోనా పాజిటివ్ అనే పదాన్ని తమ రోజువారీ పదాల్లో ఒకటిగా అలవాటు చేసేసుకున్నారు.  మరోపక్క  కరోనాతో పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్న వారూ ఉన్నారు. అయితే చాలామంది పదిహేను రోజులకే కరోనా నుండి బయటపడుతుంటంతో ఓ ధైర్యం వచ్చేసింది జనాల్లో. మొత్తానికి ఈ కరోనా సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా  అందర్నీ కమ్మేస్తూ వస్తోంది.
    Also Read : బిగ్ బాస్-4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న కామెడీయన్లు?
    ఇప్పటికే రాజమౌళి అండ్ అయన ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ లెజెండ్  ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబం పాటు డైరెక్టర్ తేజ, నిర్మాత దానయ్య, హీరోయిన్ జెనీలియా అలాగే స్టార్ హీరో విశాల్, మరియు హీరో అర్జున్ కుమార్తె  నటి ఐశ్వర్య అర్జున్ కూడా కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.  ఇక నిన్న  బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. ఇక అందరూ అర్జున్ కపూర్ ప్రియసి మాజీ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరాకి కూడా కరోనా సోకే అవకాశం ఉందని అనుమానించారు. ఆ అనుమానమే నిజం అయింది,  ఆమెకు కూడా కరోనా వచ్చిందని.. మలైకా సిస్టర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
    ఈ  బాలీవుడ్ ముదురు హీరోయిన్  బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు అయినా..  అర్జున్ కపూర్ తో ప్రేమలో పడి సల్మాన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. సల్మాన్ తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి మరీ అర్జున్ తో ప్రేమలో మునిగితేలుతుంది. అసలు మలైకాకు టీనేజ్ దాటిన  కొడుకు కూడా ఉన్నాడు. అయినా  మలైకా మాత్రం అర్జున్ కపూర్ తో ఇంకా సన్నిహితంగానే ఉంటుంది. చివరకు అతని ద్వారానే కరోనా కూడా తెచ్చుకుంది.
    అసలు ఈ కరోనా ప్రముఖులకు కూడా ఎలా వస్తోందో అర్ధం కావడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉంటూ కరోనా పై పూర్తీ అవగాహన ఉన్న ప్రముఖులకే ఇలా ఈజీగా కరోనా వస్తోన్నప్పుడు ఇక సామాన్యల పరిస్థితి ఏమిటి ?  ఏమైనా ఈ కరోనా  ఆందోళనకు గురి చేస్తోంది. మన  జీవితాల్లో ఇప్పటికే చాల మార్పులు తీసుకువచ్చేసింది.