
ఏపీలో 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ చరిత్రలో కనీవినీ ఎరుగని పరాజయాన్ని చవిచూశారు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ తరపున విజయం సాధించగా వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో గడిచిన 15 నెలల కాలంలో టీడీపీ మరింత బలహీనపడింది.
Also Read : కేంద్రం షరతుల్లో జగన్ అమలు చేయాల్సింది రెండే
అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని, పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని జోకులు పేలుస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు కామెంట్లపై స్పందించారు. చంద్రబాబు రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయంటూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని… ఫ్రీగా జూమ్ దొరకడంతో చంద్రబాబు మాటలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు మరో ఐదేళ్లు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందని చెప్పారు. మధ్యలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండవని తెలిపారు. చంద్రబాబు ఏం ఉద్ధరించారని జనం ఆయనకు ఓట్లేశారని అనుకుంటున్నారో తనకు తెలియడం లేదని చెప్పారు. రాష్ట్రంలో మరో ముప్పై సంవత్సరాల వరకు ఉచిత విద్యుత్ కు ఢోకా లేదని…. జీవో నంబర్ 22ను జగన్ సర్కార్ ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదని పేర్కొన్నారు.
జగన్ సర్కార్ రైతుల కోసం బ్యాంక్ ఖాతాలు తెరిచి పొలాల్లో విద్యుత్ వినియోగం మేరకు కరెంట్ బిల్లు మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుందని అన్నారు. జగన్ సర్కార్ త్వరలో శ్రీకాకుళంలో ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుందని తెలుస్తోంది.
Also Read : టీవీ9ను టార్గెట్ చేసిన జనసేన.. ఏమైంది?