బిగ్ బాస్ కు చైనా స్పాన్సరరా.. దుమారం?

 తెలుగు రియల్టీ షో బిగ్ బాస్ ఆదివారం ప్రారంభమైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ‘బిగ్ బాస్-4’ తొలిరోజు నుంచి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్-3 సీజన్ కు హోస్టుగా వ్యవహరించిన కింగ్ నాగార్జుననే నాలుగో సీజన్ కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. డ్యూయల్ రోల్స్ చేస్తూ నాగార్జున హోస్ట్ చేయడం ఆకట్టుకుంది. తొలిరోజు 16మంది కంటెస్టుల పరిచయం కార్యక్రమం సాఫీగా సాగింది. 16వారాలపాటు బిగ్ బాస్-4 సీజన్ సాగనుంది. ఆయా రంగాల్లో […]

Written By: NARESH, Updated On : September 7, 2020 5:25 pm
Follow us on

 తెలుగు రియల్టీ షో బిగ్ బాస్ ఆదివారం ప్రారంభమైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ‘బిగ్ బాస్-4’ తొలిరోజు నుంచి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్-3 సీజన్ కు హోస్టుగా వ్యవహరించిన కింగ్ నాగార్జుననే నాలుగో సీజన్ కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. డ్యూయల్ రోల్స్ చేస్తూ నాగార్జున హోస్ట్ చేయడం ఆకట్టుకుంది. తొలిరోజు 16మంది కంటెస్టుల పరిచయం కార్యక్రమం సాఫీగా సాగింది.

16వారాలపాటు బిగ్ బాస్-4 సీజన్ సాగనుంది. ఆయా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 16మంది కంటెస్టులను బిగ్ బాస్-4 సీజన్లో సందడి చేయనున్నారు. వీరితోపాటు మరికొందరు వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇవ్వనున్నారు. వచ్చేవారం నుంచి బిగ్ బాస్ టాస్కులు ప్రారంభం కానున్నారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ‘బిగ్ బాస్’ నిర్వాహాకులు స్పాన్సర్స్ విషయంలో ఓ తప్పుచేసినట్లు తెలుస్తోంది.

అందరినీ తప్పులను వెతికి పట్టుకొని ఎలిమినేషన్ చేసే ‘బిగ్ బాస్’ తానే ఓ తప్పుచేయడం బుల్లితెర ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు. చైనాకు చెందిన ఒప్పోతో బిగ్ బాస్ స్పాన్సర్ షిప్ చేసుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో బీసీసీఐ లాంటి పెద్ద సంస్థలు సైతం ఒప్పోతో స్పాన్షన్ షిష్ ను వదులుకున్నాయి.

కేంద్రం ప్రభుత్వం సైతం చైనాకు చెందిన యాప్స్, కంపెనీల డీల్ రద్దు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహాకులు చైనాకు చెందిన ప్రముఖ మోబైల్ సంస్థ ఒప్పోతో డీల్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ‘బిగ్ బాస్’ ఎలాంటి సమాధానం చెబుతాడో వేచిచూడాల్సిందే..!